Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు

Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..
Rgv
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 08, 2022 | 8:43 AM

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ అప్డేట్స్ పై తనస్టైల్లో స్పందిస్తుంటారు వర్మ. అలాగే గత కొద్ది రోజులుగా ఆర్జీవి.. ట్విట్టర్ ఖాతాలో చేసే ట్వీట్స్ రచ్చ గురించి తెలిసిందే. ఇక ఇటీవల వర్మ హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోస్, పార్టీస్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వర్మ.. తన ట్విట్టర్ ఖాతాలో హీరోయిన్ అప్సరా రాణితో (Apsara Rani) చేసిన ముచ్చట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‏గా మారాయి.

అప్సరా రాణిని తెలుగు తెరకు పరిచయం చేసింది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మనే. ఆర్జీవి తెరకెక్కించిన చిత్రాల ద్వారానే అప్సరా రాణి ఫేమస్ అయ్యింది. ఇక పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‏లలో నటించి మెప్పించింది అప్సరా రాణి. తాజాగా ఈ అమ్మడు ఇప్పుడు గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గోవా బీచ్‏లో ఎంజాయ్ చేస్తున్న అప్సరా రాణి.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాప్పీ సండే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ వీడియో చూసిన వర్మ.. తనస్టైల్లో స్పందించాడు.. నువ్ మాతో లేకుండా ఇలా అక్కడెక్కడో ఉంటే అది హ్యాప్పీ సండే ఎలా అవుతుందంటూ ట్వీట్ చేశాడు. దీనికి అప్సరా రాణి కూడా రిప్లై ఇచ్చింది. అయితే వీడియోను షేర్ చేస్తాను.. కాస్త్ బెటర్ ఫీలింగ్ వస్తుందని అప్సరా రిప్లై ఇవ్వగానే.. దానికి దీనికి తేడా ఏం ఉంది అంటూ అర్జీవి మళ్లీ ఆన్సర్ ఇచ్చాడు. ఇక వీరిద్దరూ పెట్టుకున్న ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు

Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Nandita Swetha: హీరోయిన్ శారీరాకృతిపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నందితా శ్వేత..