Kangana Ranaut: నేను ఫ్యామిలీతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు వెళ్తున్నా.. మరి మీరెప్పుడు?.. కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు..
RRR Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్ఠాత్మికంగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) హీరోలుగా నటించారు.
RRR Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్ఠాత్మికంగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) హీరోలుగా నటించారు. గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ఫిక్షనల్ థ్రిల్లర్ మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు పోటెత్తుతుండడంతో గతంలో ఏ భారతీయ సినిమాకు రానటువంటి కలెక్షన్లను సొంతం చేసుఉకంటోంది. మొదటి రోజే రూ.223 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్ ఇండియా సినిమా.. ఇప్పటివరకు రూ.600 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా హిందీలో సైతం రూ. 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక చెర్రీ, ఎన్టీఆర్ ల అభినయం, రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాజమౌళి ఫొటోను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించింది.
‘రాజమౌళి సార్ భారతీయ చలచిత్రాల గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కెరీర్‌లోనే ప్లాప్ సినిమానే లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోవు. ఇక్కడ ఆయన గురించి చెప్పుకునే మరో విషయం ఏమిటంటే. రాజమౌళి గారు ఒక విజయవంతమైన డైరెక్టర్ మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న గొప్ప మనిషి. దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమాభిమానాలు ఎంతో గొప్పవి. మీలాంటి రోల్ మోడల్ ఉండటం మా అదృష్టం సార్. నేను మీకు పెద్ద అభిమానినని నిజాయతీగా చెప్పుకుంటాను. రేపు కుటుంబంతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి వెళ్తున్నా. మరి మీరేప్పుడు చూస్తారు?’ అని రాసుకొచ్చింది కంగన.
Punjab CM: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. స్కూళ్లలో ఫీజుల పెంపుపై నిషేధం