కాజల్, తమన్నా.. ఇది నిజమేనా..!

కొత్త హీరోయిన్లకు ధీటుగా అవకాశాలు సొంతం చేసుకుంటూ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మలు కాజల్, తమన్నాలు మరో రంగంలోకి అడుగుపెట్టనున్నారట. ఇప్పటికే నగల వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ ఇద్దరు.. తాజాగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించనున్నట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘కేఏ’ పేరుతో కాజల్ ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవ్వగా.. అందులో భాగస్వామిగా తమన్నా ఉండనున్నట్లు టాక్. ‘అ!’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ప్రశాంత్ వర్మ.. ఇటీవల కాజల్‌కు […]

కాజల్, తమన్నా.. ఇది నిజమేనా..!

కొత్త హీరోయిన్లకు ధీటుగా అవకాశాలు సొంతం చేసుకుంటూ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మలు కాజల్, తమన్నాలు మరో రంగంలోకి అడుగుపెట్టనున్నారట. ఇప్పటికే నగల వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ ఇద్దరు.. తాజాగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించనున్నట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘కేఏ’ పేరుతో కాజల్ ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవ్వగా.. అందులో భాగస్వామిగా తమన్నా ఉండనున్నట్లు టాక్. ‘అ!’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ప్రశాంత్ వర్మ.. ఇటీవల కాజల్‌కు ఓ కథను వినిపించాడట. అది మెచ్చిన కాజల్ వెంటనే మూవీని నిర్మించేందుకు ఒప్పుకుందని.. ఇక ఈ చిత్రానికి తమన్నా సహ నిర్మాతగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరు భామలతో ప్రశాంత్ వర్మ పనిచేయగా.. అతడి టాలెంట్‌పై నమ్మకంతోనే సినిమాను నిర్మించేందుకు వారు ముందుకు వచ్చినట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, రాజశేఖర్‌తో ‘కల్కి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Published On - 3:43 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu