‘బాఘీ’ సిరీస్.. మళ్లీ వచ్చిన మొదటి హీరోయిన్

బాలీవుడ్‌లో విజయవంతమైన సిరీస్‌లలో ‘బాఘీ’ ఒకటి. ఈ సిరీస్‌లో ఇప్పటికి వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలవగా.. మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక మూడో భాగానికి హీరోగా టైగర్ ష్రాఫ్‌నే కొనసాగిస్తున్న నిర్మాతలు.. తాజాగా హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేశారు. మొదటి భాగంలో నటించిన శ్రద్ధా కపూర్.. మూడో భాగంలో  నటించనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇందులో శ్రద్ధాకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ? B […]

‘బాఘీ’ సిరీస్.. మళ్లీ వచ్చిన మొదటి హీరోయిన్

బాలీవుడ్‌లో విజయవంతమైన సిరీస్‌లలో ‘బాఘీ’ ఒకటి. ఈ సిరీస్‌లో ఇప్పటికి వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలవగా.. మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక మూడో భాగానికి హీరోగా టైగర్ ష్రాఫ్‌నే కొనసాగిస్తున్న నిర్మాతలు.. తాజాగా హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేశారు. మొదటి భాగంలో నటించిన శ్రద్ధా కపూర్.. మూడో భాగంలో  నటించనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇందులో శ్రద్ధాకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు.

కాగా ‘బాఘీ’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు చిత్రాల రీమేక్‌లు అన్న విషయం తెలిసిందే. ‘వర్షం’ రీమేక్‌ మొదటి భాగంగా.. ‘క్షణం’ రీమేక్ రెండో భాగంగా తెరకెక్కించారు. అయితే మూడో భాగానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఇక ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా.. సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Published On - 3:13 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu