నాని ప్రధానపాత్రలో ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ముందే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
This Valentine’s Day ? You will feel the magic ❤️ An @anirudhofficial Musical ?@gowtam19 @ShraddhaSrinath @SitharaEnts #Jersey pic.twitter.com/ikdUHzUSpW
— Nani (@NameisNani) February 11, 2019
అనుకున్న సమయానికి కంటే ముందుగానే షూటింగ్ పూర్తి అవుతుండటంతో నిర్మాతలు రిలీజ్ డేట్‌ను మార్చాలనుకుంటున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5, 12 తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 4వ తేదిని ‘మజిలీ’, 12వ తేదిని ‘చిత్రలహరి’ చిత్రాలు ఇప్పటికే బుక్ చేసుకున్నాయి. దీంతో ఈ రెండింటిలో ఏదో ఒక చిత్రంతో నాని పోటీ పడనున్నాడో.. లేక ముందు ప్రకటించిన రోజునే రానున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. ‘అదోంటో గానీ ఉన్నపాటుగా’ అంటూ సాగే మొదటి పాటను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.