‘సైరా’ నుంచి జగపతిబాబు ఫస్ట్‌‌లుక్

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 9:03 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ నుంచి జగపతిబాబు ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో జగపతిబాబు ‘వీరారెడ్డి’ పాత్రలో నటిస్తుండగా.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. రెడ్డి రాజుగా ఆయన లుక్ అదుర్స్ అంటూ అభిమానులు కితాబిస్తున్నారు. Unveiling the look of @IamJagguBhai as #VeeraReddy from #SyeRaaNarasimhaReddy. Wishing the versatile actor a very Happy Birthday.#HBDJagapatiBabu #SyeRaahttps://t.co/14IPmSmaJX — Konidela Pro Company (@KonidelaPro) […]

‘సైరా’ నుంచి జగపతిబాబు ఫస్ట్‌‌లుక్
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ నుంచి జగపతిబాబు ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో జగపతిబాబు ‘వీరారెడ్డి’ పాత్రలో నటిస్తుండగా.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. రెడ్డి రాజుగా ఆయన లుక్ అదుర్స్ అంటూ అభిమానులు కితాబిస్తున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అటు అభిమానుల్లోనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu