మహేశ్ మూవీని క్రాస్ చేసిన ‘ఎఫ్ 2’

విడుదలై నెల రోజులు గడుస్తున్నా కలెక్షన్లలో జోరును కొనసాగిస్తోంది ‘ఎఫ్ 2’. ఈ క్రమంలో  ఇప్పటికే పలువురు టాప్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసిన ‘ఎఫ్ 2’.. తాజాగా నైజాంలో మహేశ్ చిత్రాన్ని క్రాస్ చేసింది. మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’ నైజాంలో 22.34కోట్ల షేర్‌ను సాధించగా.. ఒక నెలలో ‘ఎఫ్ 2’ 22.47కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. దీంతో తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం. కామెడీ ఎంటర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]

మహేశ్ మూవీని క్రాస్ చేసిన ‘ఎఫ్ 2’

విడుదలై నెల రోజులు గడుస్తున్నా కలెక్షన్లలో జోరును కొనసాగిస్తోంది ‘ఎఫ్ 2’. ఈ క్రమంలో  ఇప్పటికే పలువురు టాప్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసిన ‘ఎఫ్ 2’.. తాజాగా నైజాంలో మహేశ్ చిత్రాన్ని క్రాస్ చేసింది. మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’ నైజాంలో 22.34కోట్ల షేర్‌ను సాధించగా.. ఒక నెలలో ‘ఎఫ్ 2’ 22.47కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. దీంతో తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం.

కామెడీ ఎంటర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విమర్శకులు పెద్దగా మార్కులు వేయనప్పటికీ.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ చిత్రం బాగా ఆకట్టుకుంది. దీంతో విడుదలై రోజు నుంచి కలెక్షన్లలో సత్తాను చాటుతోంది. ఇక ఈ మూవీతో పాటు వచ్చిన ‘కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో పాటు ఆ తరువాత వచ్చిన చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం కలెక్షన్లకు ప్లస్‌గా మారాయి. ఏదేమైనా గతేడాది వరుస పరాజయాలను సొంతం చేసుకున్న దిల్ రాజుకు.. ‘ఎఫ్ 2’ కలెక్షన్లు కాస్త బూస్టప్‌ను ఇచ్చినట్లు అయ్యాయి.

Published On - 4:51 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu