విజయ్ సేతుపతికి విలన్‌గా జగ్గుభాయ్.. ఆ వెర్షన్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన సీనియర్ హీరో..
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లాభమ్'. ఇందులో విజయ్‌కు ప్రత్యర్ధిగా టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాభమ్’. ఇందులో విజయ్‌కు ప్రత్యర్ధిగా టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు యూనిట్ సభ్యులు..
తాజాగా జగపతిబాబు కూడా తన పాత్రకు తనే స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తను స్టూడియోలో డబ్బింగ్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు జగ్గభాయ్. ఈ మేరకు “చాలా కాలం తర్వాత నేను తమిళంలో డబ్బింగ్ చేస్తున్నాను. ఈ తరుణం కోసం నేను చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు ఎస్పీ జనార్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. సమ్మర్లో ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
I was pretty excited to dub in Tamil after so long. Here’s behind the scenes from the dubbing studio for @VijaySethuOffl‘s #Labham. pic.twitter.com/UVJWtlcXWv
— Jaggu Bhai (@IamJagguBhai) January 30, 2021
Also Read:
షూటింగ్లో బిజీగా బన్నీ.. నిన్ను చాలా మిస్సవుతున్నా అంటూ ఎమోషనల్ .. నెట్టింట్లో వీడియో వైరల్..