షూటింగ్లో బిజీగా బన్నీ.. నిన్ను చాలా మిస్సవుతున్నా అంటూ ఎమోషనల్ .. నెట్టింట్లో వీడియో వైరల్..
దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుపల్లి అడువుల్లో జరుగుతుంది.
Actor Allu Arjun : దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుపల్లి అడువుల్లో జరుగుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్తో సహ చిత్రబృందం మొత్తం మారేడుపల్లి అడువులకు పయనమైన సంగతి తెలిసిందే. ఇక అక్కడ చిత్రీకరణ పూర్తైన తర్వాత సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం పుష్ప టీం కేరళకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ తన కూతురు అర్హను మిస్ అవుతున్నా అంటూ తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో అర్హ.. బెండకాయ దొండకాయ, నువ్వు నా గుండెకాయ అంటూ బన్నీతో ముద్దుముద్దుగా చెప్తుంది అర్హ. ఈ వీడియోను షేర్ చేస్తూ “ఐ మిస్ యూ” అర్హ అని పేర్కొన్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో ఆర్య, ఆర్య-2 తర్వాత రాబోతున్న మూడవ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘పుష్ప’ మూవీ ఆగస్ట్ 13న విడుదల కానుంది.
View this post on Instagram
Also Read:
Balakrishna New Movie: బాలయ్య సినిమా కోసం ఫాంలో ఉన్న యంగ్ హీరో ? పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్న..
Krithi Shetty : ‘ఉప్పెన’లా ఎగసిపడుతున్న ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో…