AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar Award 2023: ఆస్కార్ వేడుకలు జరిగే డాల్బీ థియేటర్ ఎంత పెద్దగా ఉంటుందో చూశారా ?.. దాని ప్రత్యేకతలు ఏంటంటే..

ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం డాల్బీ థియేటర్ ముస్తాబయ్యింది. ఇంతకీ ఈ థియేటర్‏లోనే ఆస్కార్ వేడుకలు ఎందుకు జరుగుతాయి ? దాని ప్రత్యేకతలు ఏంటో ? తెలుసుకుందామా.

Oscar Award 2023: ఆస్కార్ వేడుకలు జరిగే డాల్బీ థియేటర్ ఎంత పెద్దగా ఉంటుందో చూశారా ?.. దాని ప్రత్యేకతలు ఏంటంటే..
Dolby Theatre
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2023 | 10:03 AM

Share

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 95వ అకాడమీ వేడుకల సందడి మొదలైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఈ అవార్డ్స్ అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. అందులో మన తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు.. సెలబ్రెటీలు అమెరికాలో ల్యాండ్ అయ్యారు. మార్చి 12న అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్‏ని డాల్బీ థియేటర్‏లో ఈ వేడుకలు అంగరంగా వైభవంగా జరగనున్నాయి. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం డాల్బీ థియేటర్ ముస్తాబయ్యింది. ఇంతకీ ఈ థియేటర్‏లోనే ఆస్కార్ వేడుకలు ఎందుకు జరుగుతాయి ? దాని ప్రత్యేకతలు ఏంటో ? తెలుసుకుందామా.

డాల్బీ థియేటర్ ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‏లో నిర్మించారు. 2001 నవంబర్ 9 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ థియేటర్ ప్రత్యేకంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాక్ వెల్ గ్రూపుకు చెందిన డేవిడ్ రాక్ వెల్ రూపొందించారు. ఇందులో ఆస్కార్ అవార్డ్స్ వేడుకలతోపాటు.. ఇతర ఫిల్మ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అమెరికాలోనే అతిపెద్ద థియేటర్ ఇది. 113 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవులో ఉంటుంది. ఇందులో దాదాపు 3 వేలకు పైగా మందికి వసతి కల్పించవచ్చు.

ఈ డాల్బీ థియేటర్ కింద పక్కనే ఉన్న వీధుల్లోని ట్రక్ స్థానాలకు వెల్లే భూగర్భ కేబుల్ బంకర్ ఉంది. థియేటర్ లో కెమెరా, సౌండ్, స్టేజ్ మేనేజ్మెంట్ కోసం ఆర్కెస్ట్రా సీటింగ్ కోసం ప్రత్యేకంగా కాక్ పిట్ రూపొందించారు. డాల్బీ థియేటర్ చుట్టు పక్కల కేవలం షాపింగ్ మాల్స్ మాత్రమే ఉంటాయి. హాల్ ముందు ద్వారం నుంచి మెట్ల మార్గం వరకు మాల్స్ ఉంటాయి. ఆస్కార్ అవార్డుల వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడ హాలీవుడ్ చలనచిత్ర నిర్మాణాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఈ భవనం ముందు బొమ్మలకు దుస్తులు ధరించి ఉంచుతారు. అవార్డ్ గెలిచిన విజేతలకు మెట్ల మార్గంలో రెడ్ కార్పెట్ ఉంటుంది. 2002లో తొలిసారి ఈ థియేటర్ లో 74వ ఆస్కార్ అవార్డ్ వేడకలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా 2021లో 93వ అకాడెమీ అవార్డ్స్ తగ్గించి యూనియన్ స్టేషన్ కు తరలించడం మినహాయించి నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ భవనానికి పేరు పెట్టే హక్కుల కోసం $75 మిలియన్స్ చెల్లించింది ఈస్ట్ మన్ కొడాక్ కంపెనీ.. అయితే 2012లో ఈ థియేటర్ నామకరణ.. హక్కుల ఒప్పందం ముగియడంతో.. దీనికి తాత్కాలికంగా హాలీవుడ్.. హైలాండ్ సెంటర్‏గా నామకరణం చేశారు. 2012న మే1న దీనికి డాల్బీ లాబొరేటరీస్ 20ఏళ్ల నామకరణ హక్కుల ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దీని పేరును డాల్బీ థియేటర్ గా మారుస్తూ ప్రకటించారు. డాల్బీ థియేటర్ ఎలా ఉంటుందో కింది వీడియోలో చూసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.