ఇద్దరూ.. పక్కపక్కనే.. ఆవేశంగా..!

మెగాస్టార్ చిరంజీవి హీరో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కాగా.. ఈ భారీ బడ్జెట్ సినిమాకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ అందించారు. తాజాగా.. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:45 am, Fri, 16 August 19
ఇద్దరూ.. పక్కపక్కనే.. ఆవేశంగా..!

మెగాస్టార్ చిరంజీవి హీరో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

కాగా.. ఈ భారీ బడ్జెట్ సినిమాకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ అందించారు. తాజాగా.. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన ఫొటోలను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఫొటోస్ చూస్తుంటే.. పవన్ ఎంతో ఆవేశంగా.. డబ్బింగ్ చెప్తున్నారని అనిపిస్తోంది. పక్కనే అన్నయ్య చిరు కూడా ఆవేశంగానే.. చాలా ఇన్వాల్వ్ అయి కనిపిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ ఫొటోలు కాస్తా.. వైరల్ అయ్యాయి.

ఇప్పటికే ఈ సినిమాపై హైప్ తెచ్చేందుకు రామ్‌చరణ్ రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. అందులో ఒక భాగమే.. పవన్ వాయిస్ అందించడమని సమాచారం. ఏదేమైనప్పటికీ అన్నయ్యని.. తమ్ముడిని చూసేసరికి.. అటు పవన్.. ఇటు చిరు అభిమానులకు పండగే పండుగలా ఉంది.

కాగా.. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నయనతార నటించగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా.. తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, సుధీర్‌లు కీలక పాత్రలలో నటించారు.