మీరంటే నాకు చాలా ఇష్టం: కీర్తీ సురేష్
`మహానటి` చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్తమ నటి`గా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కీర్తిపై పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కతర్ రాజధాని దోహలో జరిగిన `సైమా అవార్డుల` వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా సాంప్రదాయ చీరకట్టులో కీర్తి దర్శనమిచ్చారు. కీర్తి మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ.. ముచ్చటించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేష్.. […]

`మహానటి` చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్తమ నటి`గా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కీర్తిపై పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కతర్ రాజధాని దోహలో జరిగిన `సైమా అవార్డుల` వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా సాంప్రదాయ చీరకట్టులో కీర్తి దర్శనమిచ్చారు. కీర్తి మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ.. ముచ్చటించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేష్.. మీరంటే.. నాకు చాలా ఇష్టమని తెలుపుగా.. మెగాస్టార్ చిరునవ్వులు చిందిస్తూ తనకు ఆశీస్సులు అందించారు. ఈ దృశ్యాన్ని సైమా అవార్డ్స్ ఆర్గనైజర్స్.. ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు.
A moment of grace and humbleness – @KeerthyOfficial reflects her admiration towards an icon and epitome of Indian Cinema, Chiranjeevi sir.#PantaloonsSIIMA #SIIMAinQatar #VisitQatar #QatarAirways #Helo #ONEFMQATAR pic.twitter.com/r2UOV67LPw
— SIIMA (@siima) August 15, 2019