Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నాని కు సూపర్ హిట్ అందించిన నిన్ను కోరి సినిమాకు కూడా శివ నిర్వాణనే దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో నానికి జోడీగా రీతువర్మ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు సినిమాపైనే అంచలనాలను పెంచాయి. నిన్ను కోరి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శివ నిర్వాన లవ్ స్టోరీ తీసుకు వస్తాడేమో అని నాని భావించాడట. లవ్ స్టోరీ లపై ఆసక్తి లేని నాని ముందే కథకు నో చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. కొత్త కథ ఏదైనా చేయాలని ఆశిస్తున్న సమయంలో శివ నిర్వాన టక్ జగదీష్ కథ తీసుకు రావడం జరిగిందని తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
నాని మాట్లాడుతూ .. ” శివ నిర్వాణ నాకు కాల్ చేసి ఒక మంచి కథ ఉంది .. వినిపించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆల్రెడీ మా ఇద్దరి కాంబినేషన్లో ‘నిన్నుకోరి’ అనే ఒక ప్రేమకథ వచ్చింది. మళ్లీ ఇతను ప్రేమ కథనే తీసుకుని వచ్చి ఉంటాడని అనుకున్నాను. మొహమాటానికి వినేసి బాగోలేదని చెప్పేస్తే ఒక పనైపోతుంది గదా అనుకున్నాను. అతను వచ్చి ‘టక్ జగదీశ్’ కథను వినిపించాడు. ఆ కథ వినగానే నేను షాక్ అయ్యాను .. అంత గొప్పగా అనిపించింది.అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ నెల 23వ తేదీన విడుదల కావలసి ఉంది .. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :