ట్రైలర్ టాక్: ప్రేమ.. పగ.. ప్రతీకారం..

హైదరాబాద్: ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. ఇటీవల ‘హిప్పీ’ సినిమాతో అతడు ప్లాప్ చవి చూసినా.. దాని నుంచి త్వరగానే కోలుకుని మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమా ఆగష్టు 2న విడుదల కాబోతోంది. ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ విషయానికి వస్తే.. సరదాగా […]

ట్రైలర్ టాక్: ప్రేమ.. పగ.. ప్రతీకారం..
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2019 | 8:55 AM

హైదరాబాద్: ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. ఇటీవల ‘హిప్పీ’ సినిమాతో అతడు ప్లాప్ చవి చూసినా.. దాని నుంచి త్వరగానే కోలుకుని మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమా ఆగష్టు 2న విడుదల కాబోతోంది. ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ట్రైలర్ విషయానికి వస్తే.. సరదాగా జీవితాన్ని సాగిస్తున్న గుణ(కార్తికేయ).. మొదటి చూపులోనే సెల్ ఫోన్‌ షాప్‌లో పని చేసే అమ్మాయి(అనఘా)తో ప్రేమలో పడతాడు. గుణ.. అతడి స్నేహితుడు(రంగస్థలం మహేష్)తో కలిసి పదే పదే షాప్‌కు వెళ్తూ ఆ అమ్మాయితో పరిచయాన్ని పెంచుకుంటాడు. ఇక వీరి ప్రేమ పెళ్లి పీటల వరకూ వెళ్తున్న సమయంలో అనుకోని అతిథిలా వారి జీవితంలోకి గద్దలగుట్ట రాధా(ఆదిత్య మీనన్)వస్తాడు. ఇక అక్కడ నుంచి గుణ జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి. అసలు రాధా ఎవరు.? వీరికి.. అతనికి మధ్య సంబంధం ఏమిటి.? గుణ ప్రేమలో సఫలమవుతాడా.? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాలి.

ట్రైలర్‌ మొదట్లో కొన్ని ప్రేమ సన్నివేశాలు.. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు అర్జున్ జంధ్యాల తన గురువు బోయపాటి శ్రీను మార్క్‌ను చూపించాడని చెప్పవచ్చు. హీరో కార్తికేయ.. అటు లవర్ బాయ్‌గా.. ఇటు యాక్షన్ హీరోగా రెండు షేడ్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అనఘా ట్రెడిషనల్‌ లుక్స్‌లో మెప్పించింది. ‘మ‌నిషి రూపం వేరు.. నిజస్వ‌రూపం వేరు’, నేను ఏడారిలో ఉన్నా.. గొంతెండిపోతోంది. కొన్నే నీళ్లు దొరికాయి. అవి మంచివా.. చెడ్డవా అని ఆలోచించే ఓపిక తీరిక నాకు లేవు’. ఈ రెండు డైలాగులను ట్రైలర్‌లో హైలైట్ చేశారు.

ఆదిత్య మీనన్, సీనియర్ నటి మంజు భార్గవి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. హీరో కార్తికేయ ‘ఆర్ఎక్స్100’ మించి హిట్ ఈ సినిమాతో సాధిస్తాడనేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.

ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
వైద్య ఆరోగ్య శాఖలో 26,263 కొత్త ఉద్యోగాలు.. త్వరలో భర్తీ!
వైద్య ఆరోగ్య శాఖలో 26,263 కొత్త ఉద్యోగాలు.. త్వరలో భర్తీ!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??