‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు హైకోర్టులో ఊరట

బిగ్‌బాస్ షో నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసుల్లో వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రియాలిటీ షోను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. హోస్ట్ నాగార్జునతో పాటు షో నిర్వాహకులు పదిమందిని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. అందులో బిగ్‌బాస్ షో మొత్తం […]

‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు హైకోర్టులో ఊరట
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2019 | 1:07 PM

బిగ్‌బాస్ షో నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసుల్లో వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రియాలిటీ షోను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. హోస్ట్ నాగార్జునతో పాటు షో నిర్వాహకులు పదిమందిని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.

అందులో బిగ్‌బాస్ షో మొత్తం బూతు మాదిరిగా తయారైందని, దీని ప్రభావం జనాల మీద ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ షోను నిలిపివేయడం సాధ్యం కాని పక్షంలో రాత్రి 11గంటల తరువాతే ఎపిసోడ్స్‌ను ప్రసారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో తెలిపారు. సినిమా మాదిరిగా ప్రతి ఎపిసోడ్‌ సెన్సార్ చేశాకే టీవీలో ప్రసారం చేయాలని హైకోర్టును విఙ్ఞప్తి చేశారు. మరోవైపు తమపై వివిధ పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని బిగ్ బాస్ షో యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. వీటన్నింటిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

కాగా ఈ నెల 21 నుంచి బిగ్ బాస్ ప్రారంభం కానుంది. 100రోజుల పాటు జరగనున్న ఈ షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. మొదటి రెండు సీజన్లు పెద్దగా వివాదాలు లేకుండా సాగగా.. మూడో సీజన్‌‌ మాత్రం మొదలుకాకుండానే పలు వివాదాల్లో చిక్కుకుంది.