బిగ్ మూవీ నుంచి జగ్గుభాయ్ ఔట్

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ కంటే ముందు ఫిక్స్ అయిన నటుడు జగపతి బాబు. ఆ తర్వాతే మిగతా నటుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే జగపతి బాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే జగపతి బాబు ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియలేదు. కాగా 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ […]

బిగ్ మూవీ నుంచి జగ్గుభాయ్ ఔట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 17, 2019 | 1:03 PM

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ కంటే ముందు ఫిక్స్ అయిన నటుడు జగపతి బాబు. ఆ తర్వాతే మిగతా నటుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే జగపతి బాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే జగపతి బాబు ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియలేదు. కాగా 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. మహేష్ బాబు మిలటరీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం కాశ్మీర్ షెడ్యూల్ పూర్తికాగానే హైదరాబాద్‌కు వచ్చేస్తుంది చిత్రబృందం. ఇక మహేష్ బాబు, ప్రకాష్ రాజ్‌ల కాంబినేషన్ ఒక్కడు నుంచి మహర్షి దాకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో మరోసారి రిపీట్ కావడం హిట్ సెంటిమెంట్ కూడా తోడవుతుందని అభిమానులు భావిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుంది.