ఈ ఫొటో చూసి.. మా అమ్మానాన్నలను తిట్టకండి..!

ఈ ఫొటో చూసి మా అమ్మానాన్నలను తిట్టకండి అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తన చిన్నతనంలో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అందులో ప్యాంట్, చొక్కా గుబురు జుట్టుతో నిల్చొని ఉన్నారు. నెటిజన్లను ఉద్ధేశిస్తూ వర్మ సరదాగా కామెంట్ చేశారు. ‘స్కూలు రోజుల్లో నేను దిగిన ఫొటో ఇది. మీరు మా అమ్మానాన్నల్ని తిట్టకండి. ఆ దుస్తుల్ని నేనే కొనుకున్నా అని’ పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వచ్చాయి. మీ […]

ఈ ఫొటో చూసి.. మా అమ్మానాన్నలను తిట్టకండి..!
Ram Gopal Varma
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 17, 2019 | 10:22 AM

ఈ ఫొటో చూసి మా అమ్మానాన్నలను తిట్టకండి అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తన చిన్నతనంలో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అందులో ప్యాంట్, చొక్కా గుబురు జుట్టుతో నిల్చొని ఉన్నారు. నెటిజన్లను ఉద్ధేశిస్తూ వర్మ సరదాగా కామెంట్ చేశారు.

‘స్కూలు రోజుల్లో నేను దిగిన ఫొటో ఇది. మీరు మా అమ్మానాన్నల్ని తిట్టకండి. ఆ దుస్తుల్ని నేనే కొనుకున్నా అని’ పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వచ్చాయి. మీ అభిరుచి అలాంటిది కాబట్టే చిత్రపరిశ్రమకు వచ్చారు. పూల రంగడు, కలర్ ఫోటో కాదు కాబట్టి సరిపోయింది. మరి హెయిర్ స్టైల్ విషయం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.