AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VV Vinayak: అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి.. డైరెక్టర్ వివి వినాయక్..

దర్శకుడు వి.వి. వినాయక్ ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించారు. స్టార్ హీరోలతో అనేక చిత్రాలు రూపొందించిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, సినిమాలు, అలాగే బాహుబలి సమయంలో రాజమౌళి, ప్రభాస్ ఆందోళనలను వివరించారు. కమర్షియల్ సినిమాల సృష్టి ఎంత కష్టమో, వాటికి లభించే గౌరవం ఎందుకంత తక్కువో స్పష్టం చేశారు. విజయాలను, పరాజయాలను పూరి ఎలా తేలికగా తీసుకుంటారో వెల్లడించారు.

VV Vinayak: అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి.. డైరెక్టర్ వివి వినాయక్..
Vv Vinayak
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2026 | 4:26 PM

Share

దర్శకుడు వి.వి. వినాయక్, తనతో పాటు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన పూరి జగన్నాథ్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి సహచర దర్శకులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. వారి ముగ్గురి జర్నీ దాదాపు ఒకేసారి ప్రారంభమైందని, వారంతా ఊహించని విజయ శిఖరాలను అధిరోహించారని వినాయక్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో, వినాయక్ ముఖ్యంగా పూరి జగన్నాథ్ వ్యక్తిత్వంపై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఆసక్తికరంగా వివరించారు. పూరి జగన్నాథ్ జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటారని, తల బద్దలు కొట్టేసుకుని సీరియస్‌గా ఆలోచించడని వినాయక్ తెలిపారు. తను చాలా లైట్‌గా, ధైర్యంగా ఉంటాడని, ఈ లక్షణమే తనకు ఎంతగానో నచ్చుతుందని అన్నారు. దీనికి ఉదాహరణగా, శివమణి సినిమాకు తొలి రోజు ఫ్లాప్ టాక్ వచ్చిన సందర్భాన్ని వినాయక్ ప్రస్తావించారు. సినిమా పోయిందని, అట్టర్ ఫ్లాప్ అని ఫోన్ ద్వారా తెలియజేసినా, పూరి మాత్రం ఏమాత్రం కలత చెందకుండా, నిశ్చలంగా ఫోన్ చూసుకుంటూ, ఇంకేంటి రేపు కలుద్దాం అని బదులిచ్చారని వినాయక్ వివరించారు. ఈ సంఘటన తనను ఎంతగానో షాక్‌కు గురిచేసిందని, ఇంత ఈజీగా ఒక సినిమా ఫలితాన్ని ఎలా తీసుకోగలుగుతున్నాడని ఆశ్చర్యపోయానని అన్నారు. వచ్చే జన్మంటూ ఉంటే అతడిలా పుట్టాలని.. ఒక్క రోజైనా తనలాగా బతకాలని చెప్పుకొచ్చారు.

అదేవిధంగా, బాహుబలి వంటి భారీ చిత్రం విడుదలైన తర్వాత తొలి మూడు-నాలుగు రోజులు నెగటివ్ టాక్ వచ్చినప్పుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్ వంటి ప్రముఖులు తీవ్ర నిరాశలో ఉన్నారని వినాయక్ పేర్కొన్నారు. ఆ సమయంలో వారంతా డల్‌గా కనిపించారని, బయట మాట్లాడుకునే మాటలు నిజమేమో అని భావించారని వివరించారు. ఆ సినిమా స్థాయిని అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులకు కనీసం ఏడు నుంచి పది రోజులు పట్టిందని, కానీ ఆ మూడు-నాలుగు రోజులు వారు అనుభవించిన బాధ చాలా తీవ్రమైందని వినాయక్ చెప్పారు. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పూరి జగన్నాథ్ వైఖరి మాత్రం స్థిరంగా ఉంటుందని, అతను విజయాలను, పరాజయాలను ఒకే రీతిలో చూస్తాడని వినాయక్ స్పష్టం చేశారు.

ఇంకా, వినాయక్ వాణిజ్య చిత్రాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కమర్షియల్ సినిమాలను చాలా తక్కువ చూపుతో చూస్తారని, అవి డబ్బు సంపాదించిన తర్వాతే గొప్పగా చూస్తారని అన్నారు. ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్లకు, కమర్షియల్ డైరెక్టర్లకు మీడియాలో, మేధావి వర్గంలో తగినంత గౌరవం లభించదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో సినిమా తీయడం చాలా కష్టమని, దీని గురించి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా తనకు చెప్పారని వినాయక్ గుర్తు చేసుకున్నారు. ఒక బుక్‌లోని కథతో ఆర్ట్ ఫిల్మ్ తీసి నేషనల్ అవార్డు తీసుకోవడం సులువు కావచ్చని, కానీ ఐదు పాటలు, ఐదు ఫైట్లు, కామెడీ, కథకు సంబంధం లేని 100 విషయాలను ఒక కథలో పొందుపరిచి, దాన్ని హిట్‌గా మార్చడం ఎంత కష్టమో చాలామందికి తెలియదని వినాయక్ అన్నారు. పూరి జగన్నాథ్ ఏది జరిగినా తేలికగా తీసుకుంటాడని, ఓ సినిమా అయిపోగానే నెక్స్ట్ కథపై దృష్టి సారిస్తాడని వినాయక్ తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

Follow Us