AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K Kavitha: వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత.. ఈ సంప్రదాయం గురించి మీకు తెలుసా..?

తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత వధువు మెడలో తాళి కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది రాజకీయ కార్యక్రమం కాదు.. ముదిరాజ్‌ సంప్రదాయంలో భాగంగా జరిగిన వివాహ తంతు. కవితను ఇంటి ఆడబిడ్డగా భావించిన వరుడు బాలప్రసాద్‌ తన చేతుల మీదుగా తంతు జరిపించాలని కోరడంతో ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

K Kavitha: వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత.. ఈ సంప్రదాయం గురించి మీకు తెలుసా..?
Kavitha Wedding Video
Shaik Madar Saheb
|

Updated on: Aug 26, 2026 | 5:42 PM

Share

తెలంగాణ రక్షణ సేన చీఫ్‌.. కల్వకుంట్ల కవిత వధువు మెడలో తాళి కట్టారు. షాక్‌ అవ్వాల్సిన పనిలేదు. ఇదంతా సంప్రదాయంలో భాగమే.. నిన్న ఓ పెళ్లికి వెళ్లిన కవితను వరుడు మీ చేతులమీదుగా తంతు జరగాలని భావించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ – కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది.

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు.. కవిత ముఖ్య అనుచరుల్లో ఒకరిగా ఉన్నాడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్‌కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. వివాహ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది.

వీడియో చూడండి..

ఈ క్రమంలోనే.. బాలప్రసాద్ – శివాని వివాహ ముహూర్తం సమయంలో… తనకు అక్కాచెల్లెళ్లు లేరని.. ఆడబిడ్డగా మీరే వధువు మెడలో తాళి కట్టాలని కవితను బాలప్రసాద్ కోరాడు.. బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Follow Us