Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ చిత్రంపై ఉన్న ఆ అపోహలను ఖండించిన హీరో కార్తీ.. ఏమన్నారంటే..
Ponniyin Selvan: మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. అంత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచానలు ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో...
Ponniyin Selvan: మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. అంత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచానలు ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదలవుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీల్లోనూ క్యూరియాసిటీ నెలకొంది. విక్రమ్ చియాన్, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాళ్లతో పాటు మరికొంత మంది ప్రముఖులు నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
సినిమా తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్‌ను కండక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఇందులో పాల్గొన్న హీరో కార్తీ.. పొన్నియిన్ సెల్వన్ సినిమాపై వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను బాహుబలితో పోల్చుతున్నారు. చిత్ర యూనిట్‌కు సైతం ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాంటా. దీంతో ఈ విషయమై కార్తీ మాట్లాడుతూ.. ‘పొన్నియిన్ సెల్వన్ సినిమా బాహుబాలిలా ఉంటుందా.? అని కొంతమంది అడుగుతున్నారు. ఇది ‘బాహుబలి’లా ఉండదు.
ఎందుకంటే మనం ఇప్పటికే ఆ సినిమా చూసేశాం. కాబట్టి దీన్ని ‘బాహుబలి’తో పోల్చాల్సిన అవసరం లేదు. 70 ఏళ్లుగా నవలా రూపంలో ఉన్న కథను మణిరత్నం సినిమాగా తీశారు’ అని స్పష్టం చేశారు. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..