AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonal Chauhan: ‘నా డ్రీమ్ రోల్.. ఆ హీరోతో ఓ రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది’.. సోనాల్ చౌహన్ ఆసక్తికర కామెంట్స్..

దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Sonal Chauhan: 'నా డ్రీమ్ రోల్.. ఆ హీరోతో ఓ రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది'.. సోనాల్ చౌహన్ ఆసక్తికర కామెంట్స్..
Sonal Chauhan
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2022 | 7:25 AM

Share

కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నాగ్ పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‏గా రాబోతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కథానాయికగా నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించడానికి ఎలాంటి కసరత్తు చేశారు ? అని అడగ్గా.. ” ఇందులో శారీరకంగా, మానసికంగా చాలా సవాల్ తో కూడుకున్న పాత్ర చేశాను. ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. యాక్షన్ తో పాటు ఎంఎంఎ శిక్షణ పొందాను. అయితే శిక్షణలో రెండో రోజే నా కాలివేలు ఫ్రాక్చర్ అయ్యింది. చిన్న గాయమే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్ రే తీయమని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ శిక్షణలోకి వచ్చాను. అలాగే ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

గన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి ఆ ? అడగ్గా.. ” మా నాన్న పోలీస్ ఆఫీసర్ కావడం వలన గన్స్ తో నాకు పరిచయం వుంది (నవ్వుతూ). అయితే ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్ ని పట్టుకోవడం, లోడ్ చేయడం, వాటిని హ్యాండిల్ చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. దాదాపు రెండు నెలలు పైగా శిక్షణ సాగింది. అలాగే డైలాగ్ డిక్షన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధపెట్టాను. ఒక నటిగా చాలా తృప్తిని ఇచ్చిన చిత్రమిది. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఒక డ్రీమ్ టీంతో కలసి పని చేయడం గొప్ప ఆనందం ఇచ్చింది. నిజంగా ఇందులో నా పాత్ర ఒక డ్రీమ్ రోల్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా చూసిన తర్వాత కేవలం గ్లామరస్ పాత్రలోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయగలనే నమ్మకం కుదురుతుందని భావిస్తున్నాను.” అని తెలిపింది. నాగార్జున గారితో పని చేయడం ఒక డ్రీమ్. ఆ కల ఈ సినిమాతో తీరింది. నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన్ని కలసినప్పుడు కాస్త నెర్వస్ గా ఫీలయ్యా. అయితే పది నిమిషాల మాట్లాడిన తర్వాత నా భయం అంతా పోయింది. నాగార్జున గారు చాలా గ్రేట్ పర్శన్. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. నాగార్జున గారు కింగ్ అఫ్ రోమాన్స్. వేగం పాటలో మా కెమిస్ట్రీ చూసేవుంటారు. అయితే ‘ ది ఘోస్ట్’ యాక్షన్ థ్రిల్లర్. నాగార్జున గారితో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.