Actor Abbas : ఆసక్తికర విషయాలను వెల్లడించిన అబ్బాస్.. అందుకే సినిమాలను వదిలేసాడట..!!
అబ్బాస్ తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. . 1996 సమయంలో అబ్బాస్ పేరు మారుమోగిపోయింది. అప్పట్లో ఆయన నటించిన ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ అయింది.
Actor Abbas : అబ్బాస్ తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. . 1996 సమయంలో అబ్బాస్ పేరు మారుమోగిపోయింది. అప్పట్లో ఆయన నటించిన ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ అయింది. అప్పట్లో వచ్చిన ఈ సినిమా ఎన్నో సంచనాలను సృష్టించింది. ప్రేముకులందరికీ నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత అబ్బాస్ కు ఫ్యాన్స్ విపరితంగా పెరిగారు. ఆ తర్వాత తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన అబ్బాస్.. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు.
తమిళ్ రెండు సీరియల్స్ లో నటించి అబ్బాస్ 2016లో ఒక మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం అయన సినీ జీవితానికి దూరంగా న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. తాజాగా ఆయన సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణం చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడం చాలా బోర్ అనిపించింది అందుకే నటనకు గుడ్ బై చెప్పను అని అన్నాడు అబ్బాస్. మనసు పెట్టలేనప్పుడు నటనకు న్యాయం చేయలేనని అనిపించి సినిమాల నుంచి బయటికి వచ్చేశానని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Master Movie: అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయ్ ‘మాస్టర్’.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!