Varalaxmi Sarathkumar : శంకర్ దర్శకత్వంలో సినిమాను మిస్ చేసుకున్న వరలక్ష్మీ.. కారణం ఇదే

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన పాపులర్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar : శంకర్ దర్శకత్వంలో సినిమాను మిస్ చేసుకున్న వరలక్ష్మీ.. కారణం ఇదే
తమిళంలో వరుస సినిమాలు చేస్తోన్న సమయంలోనే వరలక్ష్మి తెలుగులో ఎంటర్‌ ఇచ్చింది. 
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2021 | 5:39 AM

Varalaxmi Sarathkumar : ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన పాపులర్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంలో ఆమె స్టార్ హీరోల సినిమాల్లోనే నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో మెప్పించింది. అలా ఆమె పోషించిన సినిమాలు .. పాత్రలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రవితేజ హీరోగా రూపొందిన ‘క్రాక్’ సినిమాలోను లేడీ విలన్ పాత్రలో నటించి మెప్పించింది వరలక్ష్మీ.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది.  వరలక్ష్మీ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. శంకర్ దర్శకత్వంలో హీరో సిద్ధర్థ్ నటించిన బాయ్స్ సినిమాలో హీరోయిన్ గా మొదట వరలక్ష్మిని ఎంపిక చేశారట. అయితే ఆ సమయంలో ఆమె వయసు 17 సంవత్సరాలు అంత చిన్న వయసులో యాక్టింగ్ వద్దని తన తండ్రి శరత్ కుమార్ చెప్పడంతో ఆ సినిమాను వదులుకుందట వరలక్ష్మీ. ఆతర్వాత  ఆ అవకాశం జెనిలీయాకు దక్కింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ గా నిలించింది. ఆతర్వాత చదువును పూర్తి చేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అంటూ వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa movie update: అల్లు అర్జున్‏కు విలన్‏గా నటించనున్న బాలీవుడ్ స్టార్.. ఈసారైన కన్ఫామ్ చేస్తారా ?