Aakasham Nee Haddhu Ra : ఓటీటీలోనే కాదు బుల్లితెర మీదకూడా సత్తాచాటిన సూర్య సినిమా..
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశం నీహద్దురా’. మలయాళ క్రేజీ హీరోయిన్ అపర్ణా బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఇక గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన...
Aakasham Nee Haddhu Ra : తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశం నీహద్దురా’. మలయాళ క్రేజీ హీరోయిన్ అపర్ణా బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఇక గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ఈ సమ్మర్ లో విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ చివరకు ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.
అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ.. హ్యూజ్ రెస్పాన్స్ ను అందుకుంది. గతేడాది ఓటీటీలో అత్యధికంగా చూసిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీలోనే కాదు బుల్లితెరమీదకూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఈ సినిమాకు 6.77 టీఆర్పీ దక్కింది. ఇటీవల కాలంలో సూర్య సినిమాలకు ఇంత రేటింగ్ రాలేదు. వరుసగా సూర్య నటించిన సినిమాలన్నీ పహ్లాపులుగా నిలిచాయి. ‘ఆకాశం నీహద్దురా’ ఒక్కటే అటు ఓటీటీలోనూ ఇటు బుల్లితెరమీద సత్తా చాటింది.