AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubbing Janaki : సగం చెన్నై కొనేంత డబ్బు సంపాదించా.. అప్పట్లో కిలో మాంసం ధర ఎంతంటే.. డబ్బింగ్ జానకి..

దశాబ్దాల సినీ ప్రయాణంలో వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసిన నటి డబ్బింగ్ జానకి. వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక కష్టాలు, సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. తాను సంపాదించిన డబ్బుతో సగం చెన్నైని కొనుక్కునేంత స్థితిలో ఉండేదాన్ని అని తన గత జీవిత విశేషాలను పంచుకున్నారు. కిలో మాంసం ధర సైతం తెలిపారు.

Dubbing Janaki : సగం చెన్నై కొనేంత డబ్బు సంపాదించా.. అప్పట్లో కిలో మాంసం ధర ఎంతంటే.. డబ్బింగ్ జానకి..
Dubbing Janaki
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2026 | 8:08 AM

Share

సినీ ప్రపంచంలో కథానాయికగా ఆ తర్వాత సహాయ నటిగా ఓ వెలుగు వెలిగిన నటి డబ్బింగ్ జానకి. దాదాపు 1000కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసింది. అలాగే పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డబ్బింగ్ జానకి మాట్లాడుతూ తన గతాన్ని, ఆర్థిక కష్టాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పంచుకున్నారు. తాను డబ్బు సంపాదించిన కాలంలోనే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి ఉంటే, సగం చెన్నై నగరాన్నే కొనుక్కోగలిగేదాన్నని ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ రోజుల్లో స్థలాలు కొనుక్కోవాలనే ఆలోచన రాలేదని, డబ్బు సంపాదించినా సరైన పెట్టుబడి మార్గాలపై అవగాహన లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆనాటి ధరలను గుర్తుచేసుకుంటూ, కిలో మాంసం కేవలం రెండు రూపాయలకే లభించేదని ఆమె తెలిపారు. ఈ మాటలు ఆ కాలపు తక్కువ ధరల వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

అయితే, ఈ తక్కువ ధరల కాలంలోనే ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన పెద్ద బాబు పుట్టిన తరువాత, ఆమె పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండేవారని.. ఆకలి, డబ్బు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో వారికి ఊహించని సహాయం అందించింది ఆమె భర్త స్నేహితుడు జోసెఫ్. లలితా శివజ్యోతి కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేసే జోసెఫ్, తన రోజువారీ భత్యం (బేటా)ను వారికి పంచుకునేవాడని ఆమె వివరించారు. అప్పట్లో డ్రైవర్ల బేటా రూపాయిన్నరో, రెండు రూపాయలో మాత్రమే ఉండేది. అందులో అర్ధ రూపాయి తన కోసం ఉంచుకొని, మిగిలిన మొత్తాన్ని వారికి ఇచ్చేవాడని ఆమె కృతజ్ఞతతో తెలియజేశారు. జోసెఫ్ ఇచ్చిన ఆ చిల్లర పైసలతోనే తమ భర్త వెళ్లి బియ్యం, పప్పులు, ఉప్పు వంటి నిత్యావసరాలను కొనుగోలు చేసేవారని, ఆ విధంగా రోజులు గడిపేవారని ఆమె తెలిపారు. అప్పుడప్పుడు ఆ డబ్బుతో పావు కిలో మాంసం, కైమా తెచ్చుకొని వండుకొని తినేవారని ఆనాటి కష్టాలను వివరించారు. తమ కష్టాలను చూసి జోసెఫ్ ఎంత బాధపడేవాడో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుందని ఆమె చెప్పారు.

సినిమా రంగంలో ఉన్నప్పటికీ, పెద్ద బాబు పుట్టినప్పుడు ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డారని, ఆ తర్వాత కూడా కష్టాలు పూర్తిగా తొలగిపోలేదని ఆమె అన్నారు. “మేము పడిన కష్టాలు ఎవరూ పడి ఉండరు” అని ఆమె తమ అనుభవాలను పంచుకున్నారు. ఇంట్లో వారిని అడగకూడదనే స్వయంకృషి భావనతో, తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు, ఏవీఎం స్టూడియో, అమింజికరై వంటి దూర ప్రాంతాలకు ఎలా వెళ్ళేవారో కూడా ఆమె ప్రస్తావించారు, ఆనాటి రవాణా కష్టాలను పరోక్షంగా సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us