AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో రోజుకు విశాఖ సీఐఐ సదస్సు.. రూ.5.84 లక్షల కోట్లతో పారిశ్రామిక రంగంలో భారీ బూస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నేడు రెండో రోజు కొనసాగనుంది. తొలి రోజు భారీ పెట్టుబడి ప్రతిపాదనలతో ఉత్సాహంగా సాగిన ఈ సదస్సులో రెండో రోజు కూడా కీలక చర్చలు, ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.

రెండో రోజుకు విశాఖ సీఐఐ సదస్సు.. రూ.5.84 లక్షల కోట్లతో పారిశ్రామిక రంగంలో భారీ బూస్ట్!
Cii Summit In Visakhapatnam
Balaraju Goud
|

Updated on: Nov 13, 2026 | 7:23 AM

Share

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నేడు రెండో రోజు కొనసాగనుంది. తొలి రోజు భారీ పెట్టుబడి ప్రతిపాదనలతో ఉత్సాహంగా సాగిన ఈ సదస్సులో రెండో రోజు కూడా కీలక చర్చలు, ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.

సీఎం చంద్రబాబుతో ప్రత్యేక ఫైర్‌సైడ్ చాట్

నేటి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక ఫైర్‌సైడ్ చాట్ నిర్వహించనున్నారు. పేదరిక నిర్మూలన, పీ4 విధానం ద్వారా పేదరికం తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఆయన తన ఆలోచనలను వివరించనున్నారు. అంతరిక్ష సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్తు సాంకేతిక రంగాలపై ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి. నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ భద్రత, జాతీయ రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై కూడా చర్చలు నిర్వహించనున్నారు.

కేంద్ర మంత్రులతో సీఎం భేటీలు

మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు సీఐఐ సదస్సు ముగింపు సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.

రిలయన్స్ భారీ పెట్టుబడి ప్రణాళిక

మరోవైపు ఏలూరు జిల్లాలో భూగర్భ బొగ్గు నుంచి గ్యాస్ తయారు చేసే ప్రాజెక్టు కోసం రిలయన్స్ రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికను ప్రతిపాదించింది. తొలి దశలో రూ.4,300 కోట్లతో అన్వేషణ, పైలట్ ప్రాజెక్టును చేపట్టనుంది. సాంకేతికంగా సాధ్యమైతే రెండో దశలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా.

పెట్టుబడుల వెల్లువ.. వేలాది ఉద్యోగాలు

రాష్ట్రంలో తయారీ రంగానికి రూ.3.57 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.1.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు అందాయి. గ్రీన్‌కో, క్లీన్‌మాక్స్, మెఘా సంస్థలు ఈ రంగంలో ఆసక్తి చూపించాయి. ఆటోమొబైల్ రంగంలో రూ.21,285 కోట్ల పెట్టుబడులతో సుమారు 13,600 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలు వచ్చాయి. కియా విస్తరణతో పాటు హీరో మోటోకార్ప్, ఎంఎన్ఎల్ సొల్యూషన్స్ సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

తొలి రోజు మొత్తం 88 ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.5,84,355 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు నమోదయ్యాయి. ఈ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు పెద్ద ఊతం లభించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us