BSNL: ఇప్పుడు 365 రోజులు కాదు.. 395రోజుల వ్యాలిడిటీ.. రూ.లక్ష ఇన్స్‌రెన్స్..!
BSNL Recharge Plan: ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. చౌకైన ప్లాన్‌తో 395 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ఇంతకు ముందు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉండగా, ఇప్పుడు 395 రోజులకు పొడిగించింది. అలాగే లక్ష రూపాయల ఇన్స్‌రెన్స్‌ను కూడా అందిస్తోంది.

BSNL Recharge Plan: మీరు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారులైతే ఆ సంస్థ మీకోసం ఆఫర్లను తీసుకువచ్చింది. ఆ సంస్థ తన రెండు దీర్ఘకాలిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల సర్వీస్ వ్యాలిడిటీని పెంచింది. కంపెనీ రూ. 2,799, రూ. 2,449 ప్లాన్‌లు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు, మీకు రోజువారీ డేటా, SMS సౌకర్యం కూడా లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లలో ఇప్పుడు ఏయే ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
BSNL రూ. 2,799 ప్రీపెయిడ్ ప్లాన్ మొదట 365 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని అందించింది. ఇప్పుడు కంపెనీ అదనంగా 30 రోజుల వ్యాలిడిటీని జోడించింది. దీనితో సిమ్ మొత్తం 395 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత, ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుంది. అదనపు వ్యాలిడిటీ తర్వాత, ఈ ప్లాన్ సగటు రోజువారీ ఖర్చు సుమారుగా రూ. 7.09. ఎక్కువ కాలం పాటు రీఛార్జ్ చేయాలనుకునే, ప్రతిరోజూ ఎక్కువ డేటాను ఉపయోగించాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఒక మంచి ఎంపిక కావచ్చు. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ నవంబర్ 30, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ వద్ద రూ.2,449కి మరో ప్లాన్ ఉంది. దీనికి అదనపు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఈ 365 రోజుల ప్లాన్ 15 రోజుల అదనపు వ్యాలిడిటీని అందిస్తుంది. దీనితో మొత్తం సర్వీస్ వ్యాలిడిటీ 380 రోజులు అవుతుంది. వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇది అందించే ఇన్సూరెన్స్ కవర్ ఈ ప్లాన్ ప్రత్యేక లక్షణం. అదనపు వ్యాలిడిటీ తర్వాత సగటు రోజువారీ ఖర్చు సుమారు రూ. 6.44 ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, రోజువారీ డేటాను కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే లక్ష రూపాయల వరకు ఇన్స్‌రెన్స్‌ను కూడా అందిస్తోంది.
మూడు చవకైన ప్లాన్‌లు
BSNL ఇటీవల తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో రూ.172, రూ. 184, రూ. 190 కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను చేర్చింది. TRAI మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌లను ప్రవేశపెట్టారు. తక్కువ ఖర్చుతో తమ మొబైల్ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వినియోగదారులకు అందుబాటు ధరలో రీఛార్జ్ ఎంపికలను అందించడమే దీని లక్ష్యం. అందువల్ల BSNL తన పోర్ట్‌ఫోలియోలో తక్కువ ధర రీఛార్జ్‌ల నుండి దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్‌ల వరకు విస్తృత శ్రేణి ఎంపికలను అందిస్తుంది.
FESTIVAL KI KHUSHIYAN, CONNECTIVITY KA SAATH, 30 DIN EXTRA, KYA BAAT
Offer valid till 30th November 2026.
Celebrate More. Stay connected with BSNL!
Recharge smart via #BReX 👉 https://t.co/k3M68OPPOG
#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #2799plan @CMDBSNL @robertravi21
— BSNL India (@BSNLCorporate) November 12, 2026
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
