హీరోయిన్లను మించిన అందం ఈ అమ్మాడి సొంతం.. అందమైన గాన కోకిల హారిక నారాయణ్ గురించి ఆసక్తికర విషయాలు.
హారిక నారాయణ్.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ.. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'రావణసుర' సినిమాలోని రావణసుర అంథెమ్ సాంగ్‌తో తాజాగా చాలా మందికి చేరువైంది. ఇక మొన్నటి మొన్న వారసుడు మూవీ ఆడియో లాంచ్ వేడుకలో..
హారిక నారాయణ్.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ.. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘రావణసుర’ సినిమాలోని రావణసుర అంథెమ్ సాంగ్‌తో తాజాగా చాలా మందికి చేరువైంది. ఇక మొన్నటి మొన్న వారసుడు మూవీ ఆడియో లాంచ్ వేడుకలో తలపతి సాంగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది హారిక. చదివింది మెకానికల్ అయినా మ్యూజిక్ ప్యాషన్‌తో ఎదిగిన హారిక ఇప్పుడు తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన హారిక తనదైన ట్యాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తోంది.
హారిక మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. తూర్పు గోదావారి జిల్లా రాజోలులో జన్మించిన హారిక.. హైదరాబాద్‌లో విద్యనభ్యసించింది. ప్రముఖ సంగీత విద్వాంసులు అయిన బాలమురళీ కృష్ణ మనవరాలే హారిక. ఓవైపు మెకానికల్ ఇంజనీరింగ్‌లో విద్యనభ్యసిస్తూనే మరోవైపు మ్యూజిక్‌లోనూ ప్రావిణ్యం సంపాదించుకుంది హారిక. అనంతరం పలువురి వద్ద శిక్షణ తీసుకొని ప్రస్తుతం సినిమాల్లో పాటలు పాడే స్థాయికి చేరుకున్నారు హారిక.
View this post on Instagram
తన అందమైన గాత్రంతోనే కాకుండా అందమైన రూపంతోనూ మంత్ర ముగ్ధుల్ని చేస్తోందీ బ్యూటిఫుల్ సింగర్. ఇన్‌స్టాగ్రామ్‌లో హారికను ఏకంగా మూడున్నర లక్షల మంది ఫాలో అవుతున్నారు. గతంలో 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్‌ను ఇమిటేట్ చేస్తూ ఆమె రూపొందించిన ఆల్బన్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. హారిక గతంలో 90 సెకండ్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్‌ను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియోను రూపొందించారు. ఇందులో ఇంటర్నేషనల్ సింగర్స్‌ని ఇమిటేట్ చేస్తూ హారిక పాడిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోను సుమారు మూడు లక్షల మంది వీక్షించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..