Guess This Actress: తన హోయలు చూసాక కూడా అర్థమవలేదా ఆమె ఎవరని.. అందంతో ఆకర్షించే అయస్కాంతం.. ఎవరో గుర్తుపట్టండి..
వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుని అవకాశాలకు దూరమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఎవరో గుర్తుపట్టండి.

చూడగానే కట్టిపడేసే అందం.. నటనతో కోట్లాది ప్రజలను అలరిస్తారు. కానీ అదృష్టం మాత్రం ఆమడ దూరంలో ఉండిపోతుంది. అలాంటి కథానాయికల గురించి చెప్పుకుంటే ఈ ముద్దుగుమ్మ పేరు ముందువరుసలో ఉండాల్సిందే. తొలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదండోయ్.. మొదటి సినిమాలోనే గ్లామర్ హద్దులు చేరిపేసి కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. కానీ ఆ సినిమా తర్వాత అవకాశాలు వస్తాయనుకుంటే చిన్నచిన్న చిత్రాలతోనే సర్దుకుపోయింది. వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుని అవకాశాలకు దూరమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఎవరో గుర్తుపట్టండి.
ఆ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. యంగ్ హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్. ఈ మూవీతో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా గ్లామర్ విషయంలో ఈ అమ్మాయి చేసిన రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నటనపరంగానూ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వెంకీ మామ, డిస్కోరాజా, అనగనగా ఓ అతిథి వంటి చిత్రాల్లో అలరించింది. అయితే ఈ సినిమాలేవి అంతగా హిట్ కాలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకశాలు తగ్గిపోయాయి.




ఇటీవల మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. నిత్యం తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగమ్మ షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
