AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vineeth: ‘ప్రేమదేశం’ హీరో వినీత్ అక్క స్టార్ హీరోయిన్ అని తెలుసా? చిరు, బాలయ్యతోనూ నటించింది

90ల దశాబ్దంలో తెలుగు సినిమా యువతను మంత్రముగ్ధులను చేసిన సినిమా 'ప్రేమదేశం'! ఈ రొమాంటిక్ డ్రామాలో హీరోగా మెరిసిన నటీనటులు ఓవర్​నైట్​ స్టార్స్​గా మారిపోయారు. వినీత్​, అబ్బాస్​ హీరోలుగా, టబూ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఓ సెన్సేషన్​. ఇద్దరు స్నేహితులు, వాళ్ల ..

Vineeth: ‘ప్రేమదేశం’ హీరో వినీత్ అక్క స్టార్ హీరోయిన్ అని తెలుసా? చిరు, బాలయ్యతోనూ నటించింది
Vineeth
Nikhil
|

Updated on: Nov 26, 2025 | 6:21 PM

Share

90ల దశాబ్దంలో తెలుగు సినిమా యువతను మంత్రముగ్ధులను చేసిన సినిమా ‘ప్రేమదేశం’! ఈ రొమాంటిక్ డ్రామాలో హీరోగా మెరిసిన నటీనటులు ఓవర్​నైట్​ స్టార్స్​గా మారిపోయారు. వినీత్​, అబ్బాస్​ హీరోలుగా, టబూ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఓ సెన్సేషన్​. ఇద్దరు స్నేహితులు, వాళ్ల ప్రేమలు, గొడవలు, చివరికి హ్యాపీ ఎండింగ్. లవ్​, కామెడీ, ఇళయరాజా మ్యూజిక్​తో ఒక కల్ట్ హిట్​గా టాలీవుడ్​ చరిత్రలో నిలిచిపోయింది.

ఇప్పటికీ ప్రేమదేశం సినిమా అంటే ఓ మంచి ప్రేమకథ. ఈ సినిమా వినీత్‌కు ఇన్‌స్టంట్ ఫేమ్ తెచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో వినీత్​ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో అతని భార్య, కూతురు అందరి హృదయాలను ఆకర్షిస్తున్నారు. వినీత్​ భార్య ఎవరు?

కేరళలో జన్మించిన వినీత్​ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్‌గా, యాక్టర్‌గా టాలెంటెడ్. ‘ప్రేమదేశం’తో టాలీవుడ్ స్టార్​గా ఎదిగారు. కానీ, వినీత్​ పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు చాలా తక్కువ తెలుసు. ప్రేమ దేశం మూవీ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు వినీత్. ఆపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోస్ట్ బిజీయెస్ట్ హీరో అయిపోయాడు.

సరిగమలు, జెంటిల్ మెన్, W/oవి. వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి లాంటి సినిమాలు చేశాడు వినీత్. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు వినీత్. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2004 ఆగస్ట్ 28న చెన్నైకు చెందిన ప్రిస్సిల్లా మీనన్‌ను పెళ్లి చేసుకున్నాడు ఈ హీరో. వీరికి పాప అవంతి జన్మించింది. వినీత్ ఫ్యామిలీ జనరల్ గా బయట ఎక్కువగా కనిపించదు. ఈ క్రమంలో నెట్టింట వినీత్ ఫ్యామిలీ ఫోటోస్ మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Vineeth & Shobhana

Vineeth & Shobhana

మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే… వినీత్ ఫ్యామిలీలో ఓ స్టార్​ హీరోయిన్ కూడా ఉంది. ఆమె ఎవరో తెలుసా? సీనియర్​ హీరోయిన్​ శోభన! 90లలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో 230కి పైగా సినిమాల్లో మెరిసిన శోభన ప్రస్తుతం క్లాసికల్​ డాన్స్​ టీచర్​గా ఎంతోమందికి శాస్త్రీయ నృతంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె సేవలకుగానూ భారతప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీతో సత్కరించింది.

1982లో వచ్చిన భక్త ధృవ మార్కండేయ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శోభన ఆ తర్వాత విక్రమ్, మువ్వ గోపాలుడు, త్రిమూర్తులు, రుద్రవీణ, అభినందన, నారి నారి నడుమ మురారి, నేటి సిద్ధార్థ, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీ అల్లుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ.. అనతికాలంలోనే అగ్ర కథానాయికగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపు 18 ఏళ్లు గ్యాప్ తర్వాత ప్రభాస్‌తో కల్కి 2898AD సినిమాలో మరియమ్ పాత్రలో మెరిసింది. వినీత్​, శోభన అక్కాతమ్ముళ్లనే విషయం తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతున్నారు!

Follow Us