100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న చికిరి చికిరి
తెలుగు పాటల ప్రజాదరణ ఇప్పుడు క్యాసెట్ సేల్స్ నుండి డిజిటల్ వ్యూస్‌కు మారింది. చికిరి చికిరి సాంగ్ 16 రోజుల్లో 100 మిలియన్ల వ్యూస్‌తో అరుదైన రికార్డు సృష్టించింది. సారంగదరియా, కళావతి వంటి ఇతర పాటలు కూడా వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్నాయి. రీల్స్, మిలియన్ల వ్యూస్ ఆధారంగానే పాటల విజయాన్ని కొలుస్తున్న ప్రస్తుత ట్రెండ్‌ను ఈ ఆర్టికల్ విశ్లేషిస్తుంది.
క్యాసెట్ సేల్స్ ని బట్టి సాంగ్ ఎంత హిట్ అయిందని చెప్పే రోజులు, షేర్ ఆటోల్లో, బస్సుల్లో వినిపించడాన్ని బట్టి సాంగ్ ఫేమ్‌ని లెక్కలేసే రోజులు లేవిప్పుడు. ఎన్ని రీల్స్ అయ్యాయి? ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి? ఎన్ని రోజుల్లో ఆ ప్రీవియస్ రికార్డులను బీట్ చేశాయి? దీన్ని బట్టే సాంగ్ ఫేమ్‌ని డిసైడ్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు చికిరి చికిరి ఓ విషయంలో రేర్ రికార్డును టచ్ చేసింది. ఇంతకీ ఏంటదీ అంటున్నారా? చూసేద్దాం రండి.. రెహమాన్ సంగీతం, రామ్‌చరణ్ స్టెప్స్ కలిస్తే రికార్డులను బీట్ చేయడం ఏమంతకష్టం? అని మాట్లాడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. చికిరి చికిరి విడుదలైన అన్నీ భాషల్లోనూ కలిపి 16 రోజుల్లో వంద మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. సాంగ్ ూసుకుపోవడం అంటే ఇదేనంటూ హ్యాపీగా ఉన్నారు మెగాపవర్‌స్టార్ ఫ్యాన్స్. ఇంతకు ముందు ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసి సాంగుల మీద ఫోకస్ పెంచితే సారంగదరియా సాంగ్ గుర్తుకొచ్చింది. పాటలో లిరిక్స్, బీట్ పర్ఫెక్ట్ గా కుదిరితే సాంగ్ సూపర్‌హిట్ కావడం ఖాయం అని అంటున్నారు క్రిటిక్స్. 32 రోజుల్లో 100 మిలియన్లు తెచ్చుకుంది సారంగదరియా. కీర్తి సురేష్ అప్పటిదాకా ఉన్న హోమ్లీ ఇమేజ్‌ని పక్కనపెట్టి కాస్త గ్లామరస్‌గా కనిపించింది మహేష్ మూవీతోనే. కళావతి సాంగ్‌లో కీర్తిని చూసిన వాళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లిరికల్ వీడియో రిలీజ్ అయిన 35 రోజుల్లోనే ఆ సాంగ్ వంద మిలియన్ల మార్చ్ చేసింది. సాంగ్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అల వైకుంఠపురములో సినిమాను మిస్ చేయూడదు సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ దుమ్ములేపాయి. సామజవరగమన లిరికల్ వీడియోకి 105 రోజుల్లో వంద మిలియన్లు వస్తే, రాములో రాములా జస్ట్ 54 రోజుల్లోనే ఆ రికార్డును క్రాస్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్య క్రేజ్ ముందు మోకరిల్లిన అవెంజర్స్
సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్
పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

