RGV Konda movie: ‘కొండా’ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు తాజాగా తెరక్కిస్తోన్న సినిమా 'కొండా'. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా
Ramgopal varma Konda Movie: వివాదాస్పద దర్శకుడు తాజాగా తెరక్కిస్తోన్న సినిమా ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా దంపతుల నేపథ్యం బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇవాళ ఈ సినిమా ‘కొండా’ కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేశాడు వర్మ. 1980స్ లవ్ స్టోరీ విత్ నక్సల్స్ బ్యాగ్రౌండ్‌తో కొండా మూవీ తెరకెక్కుతోంది. వర్మ రిలీజ్ చేసిన పోస్టర్‌లో కొండా మురళి కేరెక్టర్‌ను ఫుల్ అగ్రెసివ్ గా చూపించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్ధం కాలే? అంటూ తీక్షణమైన చూపులతో ఉన్న హీరో కేరక్టరైజన్ పోస్టర్‌లో కనిపిస్తోంది. మరో పోస్టర్‌లో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని సీరియస్ లుక్‌తో కొండా మురళి కేరక్టర్ కనిపిస్తోంది.
చేతిలో తుపాకీ.. చుట్టూ నక్సల్స్.. ఇది మరో యాంగిల్. నాలుగైదు పోస్టర్స్‌లో అనేక యాంగిల్స్‌లో కొండా కేరక్టరైజేషన్‌ను చూపించారు వర్మ. ఇంకో పోస్టర్‌లో నుదుటికి ఎర్ర తువాలు కట్టుకుని.. చేతిలో తుపాకి పట్టుకుని తీక్షణమైన లుక్‌తో కనిపిస్తున్నాడు. మరో పోస్టర్‌లో బాటిల్‌తో తలపై నీళ్లు పోసుకుంటూ సీరియస్ లుక్‌లో ఉన్నాడు. షర్ట్‌లో నుంచి కత్తి తీస్తోన్న పోస్టర్ మరొకటి. ఇలా, పోస్టర్స్‌తోనే కొండా మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పకనే చెప్పారు వర్మ. ఇక, కొండా సురేఖను ఒక పోస్టర్‌లో అందంగా.. మరో పోస్టర్‌లో విషాద వదనంలో చూపించారు. అన్ని పోస్టర్లలోనూ నక్సల్స్, తుపాకులు కామన్‌గా ఉన్నాయి.
ఎన్‌కౌంటర్‌లో చంపబడిన నక్సలైట్ ఆర్.కె అలియాస్ రామకృష్ణకి, కొండా మురళికి ఉన్న ప్రత్యేక సంబంధం గురించి కూడా వర్మ ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ సినిమా కోసం ఇటీవలే కొండా సురేఖ-మురళి దంపతుల వివరాల కోసం వరంగల్ పర్యటన చేసిన వర్మ.. అక్కడి ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చలు జరిపి కీలక సమాచారం సేకరించి సంగతి తెలిసిందే.
ఈ సందర్బంలో పలువురు కీలక నేతలను కలిసి ఒక్కప్పటి వరంగల్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ-మురళి దంపతులకు సంబంధించిన కీలక విషయాలను సేకరించారు ఆర్జీవీ. కొండా దంపతులను కూడా కలిసి వారి జీవితం, తెలంగాణ పరిస్థితులపై సినిమా తీస్తున్నట్లు చెప్పి అంగీకారం తీసుకున్నారు వర్మ.
ఇక దర్శకుడు వర్మ ‘కొండా’ మూవీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ సంచలనం సృష్టిస్తుందని చెప్పుకొస్తున్నాడు. తాను తీస్తున్నది సినిమా కాదని, నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర అని పేర్కొంటున్నాడు వర్మ. 1995లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కరుస్తూనే ఉన్నాయంటున్నాడు. కాగా, వరంగల్ రాజకీయ వేత్తల్లో రెబల్స్ గా పేరొందారు కొండా దంపతులు.
రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పొలిటీషియన్స్‌గా తమ మార్క్ చూపించారు. వీరి జీవిత ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఈ కాన్సెప్ట్ తీసుకొని వర్మ సినిమా రూపొందిస్తుండటం విశేషంగా మారింది.
KONDA film will underline the understandable but extreme madness caused by the brutal oppression of the landlords in the 80’s and 90’s as seen here in the expression of @adithofficial pic.twitter.com/OysOd02GxA
— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2021
Read also: UP: లఖీంపూర్ టు లక్నో.. రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో యూపీలో హైటెన్షన్