Hero Ram Injured: సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. హీరో రామ్‌కు గాయాలు..

Hero Ram Injured: ఎన‌ర్జిటిక్ డాన్సులు, తన ఫెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకునే టాలీవుడ్‌ యంగ్ హీరోల్లో రామ్ పోతినేని ఒక‌రనే చెప్పాలి. ఓ సినిమా షూటింగ్‌లో..

Hero Ram Injured: సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. హీరో రామ్‌కు గాయాలు..
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2021 | 12:41 PM

Hero Ram Injured: ఎన‌ర్జిటిక్ డాన్సులు, తన ఫెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకునే టాలీవుడ్‌ యంగ్ హీరోల్లో రామ్ పోతినేని ఒక‌రనే చెప్పాలి. ఓ సినిమా షూటింగ్‌లో రామ్‌కు గాయాలయ్యాయి. వివ‌రాల్లోకెళ్తే.. రామ్ హీరోగా ద‌ర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. బాడీని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎక్సర్ సైజులు సైతం చేస్తున్న ఆయ‌న‌ మెడ‌కు గాయ‌మైంది. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. మెడ‌కు బ్యాండేజ్ ఉన్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ‘రాపో 19’ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.

‘సీటీమార్’ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ చిట్టూరి రామ్ 19 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పందెంకోడి చిత్రంతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఎన్.లింగుసామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమా షూటింగ్‌ జరుపుకొంటోంది. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గానే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించారు. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామ్‌ను తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే లింగుసామి ఓ మాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతంకుపైగా షూటింగ్‌ పూర్తయ్యింది.

రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. ఇస్టార్ట్ శంకర్ కంటే ఈ సినిమాలో ఇంకా బీస్ట్ లుక్‌లో కనిపించాలని రామ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. జిమ్‌లో గట్టిగానే కసరత్తులు కూడా చేశాడు. ఇందులో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?