Samantha: విడాకుల ప్రకటన తర్వాత సమంతా తొలి పోస్టు.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా స్టేటస్..

Samantha Divorce: అక్టోబర్ 2వ తేదీన తమ వివాహ బంధానికి సమంతా, నాగచైతన్య ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి వారి సోషల్‌ మీడియా...

Samantha: విడాకుల ప్రకటన తర్వాత సమంతా తొలి పోస్టు.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా స్టేటస్..
Samantha 1
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 04, 2021 | 1:40 PM

అక్టోబర్ 2వ తేదీన తమ వివాహ బంధానికి సమంతా, నాగచైతన్య ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత సమంతా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేరు మార్చుకున్నారు. అప్పటి నుంచి వారి సోషల్‌ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. అసలు వారిద్దరూ విడిపోవడానికి దారి తీసిన కారణాలు ఏంటన్న దానిపై వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా సమంతా తన ఇన్‌స్ట్రాగమ్‌లో ఓ స్టోరీ పెట్టింది. అది కాస్తా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. బద్దకం వదిలి ముందుకు నడవాలని..తనకు తానే రక్ష అనే భావాన్ని అంతర్లీనంగా పెట్టిన ఈ పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల ప్రకటన అనంతరం సైలెంట్‌ అయిపోయింది. అక్టోబర్‌2న తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోషల్‌ మీడియాలో ఇంతవరకు ఎలాంటి పోస్ట్‌ పెట్టలేదు. తాజా పోస్టుతో మళ్లీ నెటిజన్లు రియాక్ట్‌ అవుతున్నారు. మీరు కూడా ఆ పోస్టుపై ఓ లుక్కేయండి..