Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5: అతడే గుంట నక్క.. బయటపెట్టిన నటరాజ్‌ మాస్టర్‌.. వెక్కివెక్కి ఏడ్చిన యానీ మాస్టర్, లోబో ..!

Bigg Boss 5: తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులరిటీ సంపాదించుకుంటోంది. ఐదో సీజన్‌లో భాగంగా నాలుగో వారం పూర్తయింది. ఈ వారంలో నటరాజ్ మాస్టర్..

Bigg Boss 5: అతడే గుంట నక్క.. బయటపెట్టిన నటరాజ్‌ మాస్టర్‌.. వెక్కివెక్కి ఏడ్చిన యానీ మాస్టర్, లోబో ..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2021 | 10:14 AM

Bigg Boss 5: తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులరిటీ సంపాదించుకుంటోంది. ఐదో సీజన్‌లో భాగంగా నాలుగో వారం పూర్తయింది. ఈ వారంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్‌తో నాలుగో వారం ముగిసినట్లయింది. ఈ క్రమంలో సండే ఫండే ఎపిసోడ్‌ను నాగ్ యథావిథిగా నడిపించాడు. అయితే కంటెస్టెంట్లు మాత్రం నాగార్జునకు సర్ ప్రైజ్ ఇచ్చారు. నిన్నే పెళ్లాడుతా అనే సినిమా విడుదలై పాతికేళ్లు అవుతుండటంతో కంటెస్టెంట్లు స్పెసల్ పర్ఫామెన్స్‌లు చేశారు. సినిమాలోని అన్ని పాటలకు అందరూ తమ తమ స్టైల్లో డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేశారు. ఆ తరువాత నాగార్జున కంటెస్టెంట్లతో ఆటలు ఆడించాడు. సినిమాల పేర్లు రాయడం, వాటిని గెస్ చేయడం, దాక్కో దాక్కో మేక అంటూ ఇలా ఆటలు ఆడించాడు.ఇక మధ్యలో యానీ మాస్టర్, సిరి సేఫ్ అయినట్టు ప్రకటించారు. చివర్లో లోబో, నటరాజ్ మాస్టర్‌లు మిగిలారు.

శ్రీరాం, నటరాజ్, యానీ, ప్రియ, మానస్, జెస్సీ, సిరి, రవిలను ఓ టీంగా, మిగిలిన వారందరినీ కూడా మరో టీంగా విభజించాడు. అలా శ్రీరాం, హమీద టీంలుగా విభజించాడు. ఇందులోంచి ఒక్కో కంటెస్టెంట్ రావడం ఓ సినిమా పేరును మాటలతో చెప్పకుండా.. డ్రాయింగ్ చేసి గెస్ చేయించాలి. అలా కొందరు డ్రాయింగ్ వేసి కనిపెట్టేలా చేశారు. కానీ ఇంకొందరు మాత్రం ఆ ఆటలో ఓడిపోయారు. అలా ప్రతీ టీం నుంచి వచ్చిన ఓ కంటెస్టెంట్.. చివర్లో ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. మొదటగా సిరి వచ్చి హలో బ్రదర్ సినిమాకు సంబంధించిన డ్రాయింగ్ వేసింది. క్షణాల్లోనే రవి కనిపెట్టేశాడు. ఆ తరువాత జెస్సీతో సిరి డ్యాన్స్ వేసింది. ఆ తరువాత కాజల్ వచ్చి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను తన టీంకు వివరించే ప్రయత్నం చేసింది. అందులో విశ్వ కనిపెట్టేశాడు. ఆ తరువాత సన్నీతో కాజల్ డ్యాన్స్ వేసింది. అటుపై రవికి అత్తారింటికి దారేది అనే సినిమా వచ్చింది. దాన్ని ప్రియ క్షణాల్లో పసిగట్టింది. ఆ తరువాత రవి యానీ మాస్టర్లు డ్యాన్స్ వేసింది.

విశ్వతో ప్రియాంక డ్యాన్స్‌..

విశ్వతో ప్రియాంక డ్యాన్స్ వేసింది. వీరు పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. విశ్వ షర్ట్‌ను ప్రియాంక విప్పేసి మరీ దుమ్ములేపేసింది. రొమాన్స్‌తో అదరగొట్టేశారు. మానస్‌కు పోకిరి వచ్చింది. కానీ ఎవ్వరూ గెస్ చేయలేకపోయారు. శ్వేతా వర్మకు రారండోయ్ వేడుక చూద్దాం రాగా దాన్ని కూడా ఎవ్వరూ గెస్ చేయలేదు. జెస్సీకి ఛత్రపతి వచ్చింది. దాన్ని మాత్రం ఇట్టే కనిపెట్టేశారు. ఆ తరువాత జెస్సీ ప్రియ డ్యాన్సులు వేశారు. షన్నుకు చంద్రముఖి వచ్చింది. కానీ దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు.

యానీ మాస్టర్, లోబో వెక్కి వెక్కి ఏడ్చేశారు..

అలా ఆ టాస్క్ ముగియడంతో సిరి, లోబో, నటరాజ్ మాస్టర్లతో సిరి సేఫ్ అయినట్టు ప్రకటించాడు. చివరగా లోబో, నటరాజ్ మాస్టర్లలో ఈసీజీ అని పెట్టి.. ఎవరి హార్ట్ సిగ్నల్ ఫ్లాట్ లైన్‌గా ఉంటుందో వారే ఎలిమినేట్ అయినట్టు చెప్పాడు నాగార్జున. అలా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక యానీ మాస్టర్ అయితే వెక్కి వెక్కి ఏడ్చేసింది. రేపటి నుంచి ఉల్లిపాయలు కోసేది ఎవరు.. నాకు దోశలు పెట్టేది ఎవరు అని లోబో ఎమోషనల్ కాగా, మాస్టర్ చేసిన తప్పేంటి? అని ప్రియాంక బాధపడింది.

స్టేజీపై నటరాజ్‌ మాస్టర్‌కు టాస్క్‌..

నటరాజ్ మాస్టర్‌కు జంతువులు అంటే ఎక్కువ ఇష్టమని, కంటెస్టెంట్లను జంతువులతో పోల్చమని టాస్క్ ఇచ్చాడు. అలా కొన్ని జంతువుల పేర్లు ఉన్న బోర్డును తెప్పించాడు. సిరి పాములాంటిదని, తన జోలికి వస్తేనే కాటు వేస్తుంది.. లేదంటే తన పని తాను చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు. లోబో ఎలుకలా దూరి వంటగదిలో మొత్తం తినేస్తాడని అన్నాడు. విశ్వ ఊసరవెల్లి లాంటివాడని చెప్పాడు. ఎదుటివారితో మంచి అనిపించుకోవాలని చూడకు అంటూ సలహా ఇచ్చాడు. శ్రీరామచంద్ర మొసలిలాంటి వాడని, లేనట్టే కనిపిస్తాడు.. కానీ ఇట్టే పట్టేస్తాడు.. మూడో వారం నుంచి ఆటను మార్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇక చివరగా గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టేశాడు. అందరికంటే ఎక్కువ తెలివి ఉంటుందని, కానీ అందరి విషయాల్లో తొంగి చూస్తాడు అని నటరాజ్ మాస్టర్ చెప్పాడు.

ఇవీ కూడా చదవండి:

Bigg Boss Telugu 5: దెబ్బ తీసిన నామినేషన్స్‌.. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ కావడానికి కారణాలు ఇవే..!

MAA Elections 2021 : మంచు విష్ణు కు మద్దతు ప్రకటించిన బాలయ్య.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియో..