Bigg Boss Telugu 5: దెబ్బ తీసిన నామినేషన్స్‌.. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ కావడానికి కారణాలు ఇవే..!

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ షో.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఐదో సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో కూడా చిన్న చిన్న ఘర్షణలు..

Bigg Boss Telugu 5: దెబ్బ తీసిన నామినేషన్స్‌.. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ కావడానికి కారణాలు ఇవే..!
Bigg Boss 5
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2021 | 7:43 AM

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ షో.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఐదో సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో కూడా చిన్న చిన్న ఘర్షణలు, విభేదాలతోనే కొనసాగుతోంది. ఇక ప్రతి వారం ఎలిమినేషన్‌ అనేది తప్పనిసరి. ఇప్పటివరకు ఫీమేల్‌ కంటెస్టెంట్లే ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి బిగ్‌బాస్‌ షోకు బయటకు వచ్చేశారు. ఇక ఈవారం కూడా లేడి కంటెస్టెంట్‌ను పంపిస్తారేమోనని అనుకున్నారు ప్రేక్షకులు. అదే సమయంలో నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయిపోయాడు. మరి నటరాజ్‌ మాస్టర్‌ ఎందుకు ఎలిమినేట్‌ అయ్యాడో చూద్దాం.

ప్రవర్తన కూడా ఓ కారణమే..

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టిన మాస్టర్‌.. ఏదో సాధిస్తానని బల్లగుద్దినట్లుగా చెప్పేశాడు. కానీ రానురాను జోకర్‌గా మారిపోయారు. టాస్క్‌ల్లో బాగానే పర్ఫామ్‌ చేసినప్పటికీ వింత ప్రవర్తన కారణంగా ఎలిమినేషన్‌ అవ్వక తప్పలేదని పలువురు చెబుతున్న మాట. నేను మోనార్క్‌ను, నా మాటే అందరూ వినాలి, కానీ నేనెవరి మాటా వినను అన్నట్లుగా ప్రవర్తించడంతో అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు జనాలకు కూడా విసుగు పుట్టించాడు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లపై దూరుసుకుగా ప్రవర్తించడం కూడా అందరిని విసుగు పుట్టించింది. అంతేకాదు.. నేను సింహాన్ని.. పులితో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే అంటూ పెద్ద పెద్ద డైలాగులు వదలడంతో అది కాస్త మితిమీరిపోయింది. ఇలాంటి ప్రవర్తన వల్ల ఓటింగ్‌లో దెబ్బతీసిందనే కారణాలు లేకపోలేదు.

దెబ్బ తీసిన నామినేషన్స్‌:

ఇక హౌస్‌లోఎలిమినేషన్‌కు మొదటి మెట్టు నామినేషన్‌. కంటెస్టెంట్‌ నామినేషన్‌లోకి వచ్చాడంటే చాలు ఎలిమినేషన్‌ అయ్యేది కానిది ప్రేక్షకుల ఓటింగ్‌లోకి వెళ్లిపోతుంది. ఈ వారం విశ్వ, మానస్‌, హమీదా, యాంకర్‌ రవి.. నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశారు. ఈ క్రమంలో నటరాజ్‌ వాళ్లందరితోనూ చీటికి మాటికి తగాదాలు పెట్టుకోవడం మరింత వ్యతిరేకత ఎదురైంది. దీంతో నామినేషన్‌ జరిగిన మరుసటి రోజు నుంచే హౌస్‌లో కొనసాగడం డౌటే అని అందరి కామెంట్లు చేస్తూ వచ్చారు నెటిజన్లు. అలాగే కొరియోగ్రాఫర్‌ అయిన అతడు తన డ్యాన్స్‌ ఫర్పామెన్స్‌తో పెద్దగా అదరగొట్టిందేమిలేదు.

ఇంటి సభ్యులను జంతువులతో పోల్చడం..

ఎక్కడైనా ప్రతిసారి పక్కవాడిని టార్గెట్‌ చేస్తే మొదటికే మోసం వస్తుందనే విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి విషయాలలో నటరాజ్‌ మాస్టర్‌ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. హౌస్‌ కంటెస్టెంట్లను జంతువులతో పోల్చడం, వాళ్లకు ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త జంతువుల పేర్లతో పిలవడం చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా తమ అభిమాన కంటెస్టెంట్లను జంతువులతో పోల్చినందుకు ఫ్యాన్స్‌కు కూడా మింగుడు పడటలేదు. సోషల్‌ మీడియాలో నటరాజ్‌ను దుమ్మెత్తిపోశారు. అందుకే హౌస్‌ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఆయనను ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోకపోయినా.. ఆయనే అందరిని టార్గెట్‌ చేస్తూ ఎమినేట్‌ అయ్యేలా చేసుకున్నాడు.

ఇక ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ తక్కువగా ఉన్న నటరాజ్‌కు అనఫీషియల్‌ పోల్స్‌తో పాటు అధికారిక పోల్స్‌లోనూ ఓట్లు తక్కువగా వచ్చాయని అందుకే ఆయన షోకు గుడ్‌బై చెప్పక తప్పలేదని తెలుస్తోంది. మొత్తంగా ఏదైనా సాధించాకే బయటకు వెళ్దామనుకున్న నటరాజ్‌ మాస్టర్‌ కేవలం నాలుగు వారాలకే హౌస్‌ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇవీ కూడా చదవండి:

Bigg Boss 5 Telugu: కూర్చుని కబుర్లు చెబుతున్నావ్ .. సిరి-షణ్ముఖ్ జోడిపై నాగ్ అసహనం..

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‏ను జంతువులతో పోలుస్తున్న నటరాజ్ మాస్టర్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..