PM Modi: భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసింది.. ధర్మేంద్ర మృతిపై ప్రధాని మోదీ సంతాపం..
బాలీవుడ్ దిగ్గజ నటుడు, హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు, హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి దగ్గరే వ్యైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర కన్నుమూశారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. యాక్షన్ కింగ్‌గా, బాలీవుడ్ హీ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. 1935 డిసెంబర్ 5న జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర-ప్రకాశ్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర-హేమామాలిని ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం.
అత్యంత ప్రాచుర్యం పొందిన ‘షోలే’లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ప్రధాని మోదీ సంతాపం..
ధర్మేంద్ర మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.. ‘‘ధర్మేంద్ర జీ మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసింది. ఆయన ఒక దిగ్గజ సినీ వ్యక్తిత్వం, ఆయన పోషించిన ప్రతి పాత్రకు ఆకర్షణ, ప్రాణం పోసిన అద్భుతమైన నటుడు. ఆయన వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన విధానం లెక్కలేనన్ని మందిని ఆకట్టుకుంది. ధర్మేంద్ర జీ తన సరళత, వినయం – ఆప్యాయతకు సమానంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు ఆయన కుటుంబం, స్నేహితులు -అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి.” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
