keerthy suresh: దసరా నుంచి కీర్తి ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. గ్లింప్స్‌తోనే ఇంట్రెస్ట్ పెంచేశారుగా..
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. నాని తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో..
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. నాని తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్‌లుక్, ధూమ్ ధామ్ దోస్తాన్ ఈ సినిమా పక్కా మాస్ మూవీ అని చెప్పకనే చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నేను లోకల్’ సినిమా తర్వాత ఈ జంట కలిసి నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 11.11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయమై చిత్ర యూనిట్ అధికారికంగా ఓ గ్లింప్స్‌ను ట్వీట్ చేసింది. ‘బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’..అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేశారు.
Bangaari bomma dorikenammo.. ee vaadalonaa ❤️
The first look of @KeerthyOfficial from #Dasara to be unveiled tomorrow at 11:11am ❤️?
Natural Star @NameisNani @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/Lop8AXol5O
— SLV Cinemas (@SLVCinemasOffl) October 16, 2022
చిన్న గ్లింప్స్‌తోనే కీర్తి పాత్రపై చిత్ర యూనిట్ ఆసక్తి పెరిగేలా చేసింది. పక్కా పల్లెటూరి అమ్మాయిల, డీగ్లామర్ పాత్రలో కీర్తి కనిపించనున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక బ్యాగ్రౌండ్‌లో ప్రముఖ ఫోక్ సింగర్ కనకవ్వ ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మరి కీర్తి పాత్ర తీరు ఎలా ఉండనుందో తెలియాలంటే మరికాసేపు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని 2023 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..