Pushpa: పుష్పరాజ్‌ను ప్రశ్నించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నెట్టింట వైరల్‌గా మారిన ట్వీట్..
Pushpa: సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. 7 ఏళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్ల ముసలివాళ్ల వరకూ అందరూ సోషల్ మీడియాలో అకౌంట్‌లు తెరిచేస్తున్నారు. సోషల్ మీడియాలో సమాజాన్ని ఎంతలా...
Pushpa: సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. 7 ఏళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్ల ముసలివాళ్ల వరకూ అందరూ సోషల్ మీడియాలో అకౌంట్‌లు తెరిచేస్తున్నారు. సోషల్ మీడియాలో సమాజాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందంటే చాలా కంపెనీలు తమ బ్రాండ్ల ప్రమోషన్‌కు వీటినే అడ్డగా మార్చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాను బాగా వాడుకునే వారిలో సైబరాబాద్ పోలీసులు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రాఫిక్ నియమాలను అందరికీ అర్థమయ్యేలా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఏ అంశంపై సమాజంలో చర్చ జరుగుతుందో దాని ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచేందుకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప సినిమాను కూడా వాడేశారు.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలై మంచి బజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని బన్నీ పోస్టర్‌తో సైబరాబాద్ పోలీసులు తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. బుల్లెట్ బండిపై స్టైలిష్‌గా కూర్చున్న బన్నీ ఫోటోను సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్టర్‌లో బన్నీ హెల్మెట్ ధరించలేదు, అలాగే సైడ్ మిర్రర్‌లు కూడా లేవు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన పోలీసులు.. పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ చెప్పే డైలాగుని మార్చి.. ‘హెల్మెట్ – మిర్రర్స్ లేవా పుష్ప?’ అంటూ మీమ్ రూపంలో ట్వీట్ చేశారు. ఇక ఈ ఫోటోతో పాటు.. ‘హెల్మెట్ ధరించండి, రేర్ వ్యూ మిర్రర్ లను ఫిక్స్ చేయండి. సురక్షితముగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. సైబరాబాద్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021
HIT 2: ఆధారాల కోసం సాగే అన్వేషణ.. ఆకట్టుకుంటున్న అడివి శేష్ హిట్ 2 గ్లింప్స్..
Samantha Ruth Prabhu: క్రేజీ స్టిల్స్ తో ఫ్యాన్స్‌ని కవ్విస్తున్న సమంత లేటెస్ట్ పిక్స్