AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాడ్స్ వేసి టైమ్ వేస్ట్ చేశారు.. ఏకంగా లక్షరూపాయలు ఫైన్ పడింది.. ఎక్కడంటే

సమయం చాలా విలువైంది.. సమయాన్ని వృధా చేసినందుకు ఏకంగా లక్షరూపాయలు నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడి

యాడ్స్ వేసి టైమ్ వేస్ట్ చేశారు.. ఏకంగా లక్షరూపాయలు ఫైన్ పడింది.. ఎక్కడంటే
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 18, 2021 | 8:48 AM

సమయం చాలా విలువైంది.. సమయాన్ని వృధా చేసినందుకు ఏకంగా లక్షరూపాయలు నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడి సమయాన్ని వృధా చేసినందుకు థియేటర్ కు లక్షరూపాయలు జరిమానా విధించారు. ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే.. నగరంలోని ఐనాక్స్ థియేటర్ లో సినిమా చెప్పిన సమయానికి ప్రదర్శించలేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఐనాక్స్ థియేటర్ లో 4 గంటలకు వేయాలిసిన సినిమాను 4.15వరకు మొదలు పెట్టకపోవడంతో విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తార్నాకకు చెందిన విజయ్ గోపాల్ 2019 జూన్ 22న ‘గేమ్ ఓవర్ అనే సినిమా చూడడానికి కాచిగూడ క్రాస్ రో డ్రోని ఐనాక్స్ థియేటర్‌కు వెళ్ళాడు. అయితే 4.30 గంటలకు మొదలవ్వాల్సి షో  4.45 మొదలైంది. దాంతో 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన టైం వేస్ట్ చేశారంటూ విజయ్ గోపాల్ థియేటర్ మేనేజర్‌కు ఫిర్యాదుచేశారు. వారు స్పందించకపోవడంతో… కంజ్యూమర్స్ ఫోరమ్ లో ఫిర్యాదు చేశాడు. ఆతర్వాత ఆ ఫిర్యాదును లైసెన్సింగ్ అథారిటీ ‘హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ను చేర్చారు. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955 ప్రకారం పాత పద్ధతిని అనుసరిస్తూనే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఆర్టికల్ 19(1)(2), (ఎ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు తమకు ఉందని థియేటర్ యాజమాన్యం పేర్కొంది.

ఈ కేసును హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు పి. కస్తూరి, సభ్యులు రామ్మోహన్, పారుపల్లి జవహర్ బాబుతో కూడిన బెంచ్ విచారించింది. ఐనాక్స్ సంస్థ వాదనను తప్పుపట్టింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1970, రూల్ నెం. 41 ప్రకారం కేవలం నిమిషాలు మాత్రమే ప్రకటనలు చేసే హక్కు ఉందని పేర్కొంది. దాంతో కేసు వేసిన బాధితుడికి పరిహారంగా రూ.5వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ. 5వేలు చెల్లించాలని ఐనాక్స్ లీజర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఆదేశించింది. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లక్షరూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: ప్రభాస్ సినిమా ప్రీరిలీజ్‌‌కు ముహూర్తం ఖరారు.. ఘనంగా రాధేశ్యామ్ ఈవెంట్..

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

Bigg Boss 5 Telugu 104 Episode: సీజన్‌ ముగిసే సమయంలో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. సిరిని ఇంటి నుంచి పంపినట్లే పంపి.. ట్విస్టులే ట్విస్టులు..