Bigg Boss 5 Telugu 104 Episode: సీజన్‌ ముగిసే సమయంలో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. సిరిని ఇంటి నుంచి పంపినట్లే పంపి.. ట్విస్టులే ట్విస్టులు..

Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 18, 2021 | 9:18 AM

Bigg Boss Telugu 5 Live Updates: బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. తుది పోరులో సన్నీ, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్, సిరి బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్ కావడానికి

Bigg Boss 5 Telugu 104 Episode: సీజన్‌ ముగిసే సమయంలో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. సిరిని ఇంటి నుంచి పంపినట్లే పంపి.. ట్విస్టులే ట్విస్టులు..
Bigg Boss 5

Bigg Boss Telugu 5 : బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ముగుస్తున్న సమయంలో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. శుక్రవారం ప్రసారమైన 104వ ఎపిసోడ్‌ను మొదట టారో రీడర్‌తో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల భవిష్యత్తు ఎలా ఉందన్న విషయాలను టారో రీడర్‌ శాంతి తెలిపారు. ఇక బిగ్‌బాస్‌ నిర్వాహకులు అంతకు ముందు విడుదల చేసిన ప్రోమోలో సిరి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నట్లు చూపించారు. దీనికి తగ్గట్లుగానే ఎపిసోడ్‌ చివరిలో సిరి హౌస్‌ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు.

అయితే సిరిని పంపినట్లే పంపి మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చారు. దీంతో హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సిరి ఒక్కసారిగా షణ్ముఖ్‌ను గట్టిగా హగ్‌ చేసుకుంది. ఇక సిరి మళ్లీ రీఎంట్రీ ఇవ్వగానే హౌస్‌ మేట్స్‌ అంతా షాక్‌కి గురయ్యారు. సంతోషం పట్టని సిరి, షణ్ముఖ్‌పై హగ్గుల వర్షం కురిపించింది. ఇలా శుక్రవారం ఎపిసోడ్‌ ట్విస్ట్‌లతో ముగిసింది. ఇక శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో మాజీ హౌస్‌ మేట్స్‌ సందడి చేస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. ఈ లెక్కన శనివారం ఎపిసోడ్‌ మొత్తం సందడి సందడిగా సాగినట్లు కనిపిస్తోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Dec 2021 11:06 PM (IST)

    ముగిసిన 104వ ఎపిసోడ్‌.. అదిరిపోయే ట్విస్ట్..

    శుక్రవారం ప్రసారమైన 104వ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. సిరిని హౌస్‌ నుంచి పంపిస్తున్నట్లు ప్రకటించి మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చాడు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారి షాక్‌కి గురయ్యారు. ఇలా శుక్రవారం ఎపిసోడ్‌ ట్విస్ట్‌లతో ముగిసింది. ఇక శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో మాజీ హౌస్‌ మేట్స్‌ సందడి చేస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. ఈ లెక్కన శనివారం ఎపిసోడ్‌ మొత్తం సందడి సందడిగా సాగినట్లు కనిపిస్తోంది.

  • 17 Dec 2021 10:54 PM (IST)

    అంతా తూచ్‌..

    సిరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించిన బిగ్‌బాస్‌ మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. సిరిని హౌస్‌ నుంచి బయటకు పంపినట్లే పంపి కన్వెజ్‌ రూమ్‌లోకి తీసుకెళ్లారు. దీంతో ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. ఇక సిరిని మళ్లీ హౌస్‌లోకి పంపించనున్నట్లు బిగ్ బాస్‌ తెలిపారు. సిరి ఇంటి నుంచి వెళ్లి పోయిందన్న బాధతో షణ్ముఖ్‌ బాధ పడుతుంటే.. ఆ విషయాన్ని తలుచుకుంటూ సిరి తీవ్రంగా ఎమోషన్‌కు గురైంది.

  • 17 Dec 2021 10:43 PM (IST)

    సిరి ఎలిమినేట్‌..

    నిన్నటి నుంచి వస్తున్న ఊహగానాలను నిజం చేస్తూ సిరి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా ఎమోషన్‌కు గురైన సిరి, షణ్ముఖ్‌ను హత్తుకొని ఏడ్చేసింది. ఒకానొక సమయంలో బిగ్‌బాస్‌ జోక్‌ చేస్తున్నాడని భావించినా సిరి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవడం అనివార్యంగా మారింది. ఇక హౌస్‌ నుంచి వెళ్లిపోయే సమయంలో సన్నీతో మాట్లాడిన సిరి.. గొడవలు మనసులో పెట్టుకోవద్దని తెలిపింది. షణ్ముఖ్‌ను విన్నర్‌గా చూడాలని ఉందని చెబుతూ సిరి హౌస్‌ను వీడింది.

  • 17 Dec 2021 10:31 PM (IST)

    సిరి, షణ్ముఖ్‌ల మధ్య గొడవ..

    సీజన్‌ ముగుస్తున్న సమయంలో కూడా గిల్లి కజ్జాలు తగ్గడం లేదు. ఈరోజు సిరి, షణ్ముఖ్‌ల మధ్య రచ్చ జరిగింది. సిరి చేసిన వంటను ఇతర హౌస్‌మేట్స్‌ తినలేరని, అలాంటప్పుడు నువ్వు ఎందుకు వారిని నీవారు అనుకుంటున్నావు అంటూ షణ్ముఖ్‌.. సిరిపై అరిచాడు. ఇదే విషయాన్ని మానస్‌, సన్నీల దగ్గర చెబుతూ వాపోయింది సిరి.

  • 17 Dec 2021 10:22 PM (IST)

    శ్రీరామ చంద్రకు మంచి భవిష్యత్తు.. మానస్‌కు తృప్తి ఎక్కువ..

    మరో కంటెస్టెంట్‌ శ్రీరామ చంద్ర గురించి చెప్పిన టారో రీడర్‌.. అతని మనసులో చాలా కన్ఫ్యూజన్‌ ఉందని, దానిని వదిలేయని తెలిపారు. అలాగే మంచి భవిష్యత్తు ఉందని చాలా డబ్బు సంపాదిస్తారని, మిమ్మల్ని మీరు నమ్మండి అని టారో రీడర్‌ చెప్పుకొచ్చారు. ఇక మానస్‌ భవిష్యత్తు గురించి తెలిపిన శాంతి.. అతనికి బెస్ట్‌ కార్డ్‌ వచ్చిందన్నారు. మానస్‌కు అన్ని సాధించానన్న తృప్తి ఎక్కువన్నారు. బిగ్‌బాస్‌ తర్వాత మానస్‌కు అన్ని మంచే జరుగుతాయని శాంతి చెప్పుకొచ్చారు. ఇక సన్నీ లవ్‌ లైఫ్‌ గురించి చెబుతూ.. సన్నీ లవ్‌ను సెకండ్‌ ప్రయారిటీగా.. కెరీర్‌ను ఫస్ట్‌ ప్రయారిటీగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

  • 17 Dec 2021 10:15 PM (IST)

    సన్నీ వ్యూషర్‌ ఎలా ఉండనుందటే..

    సన్నీ భవిష్యత్తు గురించి తెలిపిన శాంతి.. సన్నీ జీవితంలో కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తోన్న పనులు పూర్తవుతాయని తెలిపారు. అలాగే రిలేషన్‌ షిప్‌లో కొత్త ఫేస్‌ ప్రారంభం కానున్నట్లు చెప్పుకొచ్చారు.

  • 17 Dec 2021 10:14 PM (IST)

    సిరి పెళ్లి భజాలు మొగనున్నాయి..

    సిరి గురించి టారో రీడర్‌ శాంతి మాట్లాడుతూ.. త్వరలోనే పెళ్లి భాజాలు మొగనున్నాయని తెలిపారు. బిగ్‌బాస్‌లో సిరి చాలా నేర్చుకున్నారని తెలిపిన సిరి, భవిష్యత్తులో డబ్బు బాగా సంపాదిస్తారని, లవ్‌ రిలేషన్‌ ఇంకా మెరుగువతుందని తెలిపారు.

  • 17 Dec 2021 10:12 PM (IST)

    షణ్ముఖ్‌ భవిష్యత్తు ఎలా ఉందంటే..

    టారోట్‌ రీడ్‌ షణ్ముఖ్‌ భవిష్యత్తు గురించి చెబుతూ అంతా బాగానే ఉందని, విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని డల్‌గా ఉండకూడదని టారో రీడర్‌ను తెలిపారు.

  • 17 Dec 2021 10:10 PM (IST)

    బిగ్‌బాస్‌ హౌస్‌లో టారో రీడర్..

    బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ముగియనన్న నేపథ్యంలో 104వ ఎపిసోడ్‌లో హౌజ్‌ మేట్స్‌ కోసం బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌కు ఉన్న అనుమానాలను తీర్చడానికి హౌస్‌లోకి టారో రీడర్‌ను తీసుకొచ్చారు నిర్వాహకులు.

  • 17 Dec 2021 10:01 PM (IST)

    శ్రీరామచంద్ర కోసం ఆనీ మాస్టర్.. రవి ప్రచారం..

    శ్రీరామచంద్రను గెలిపించాలంటూ యాంకర్ రవి, ఆనీ మాస్టర్ ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఓ ఆటో వెనకాల శ్రీరామచంద్రకు ఓటు వేయాలంటూ బ్యానర్ అతికించి ప్రచారం కొనసాగిస్తున్నారు.

    Sriramachandra

    Sriramachandra

  • 17 Dec 2021 09:55 PM (IST)

    బిగ్‏బాస్ సీజన్ 5 అప్డేట్స్..

    ఇక బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన కాజల్ తన స్నేహితుల కోసం రంగంలోకి దిగింది. సన్నీకి, మానస్‏కు ఓటు వేయండి అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది కాజల్.

  • 17 Dec 2021 09:49 PM (IST)

    హౌస్‏లోకి మాజీ కంటెస్టెంట్స్…

    బిగ్‌బాస్‌ సీజన్ 5లో మాజీ కంటెస్టెంట్స్ సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా.. హరితేజ, గీతా మాధురి, అఖిల్ సార్థక్, రోల్ రైడా ఇటం్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం.

  • 17 Dec 2021 09:48 PM (IST)

    మానస్‏ను గెలిపించాలంటూ ప్రియాంక ప్రచారం..

    బిగ్‏బాస్ విన్నర్‏గా మానస్‏ను గెలిపించాలంటూ ప్రియాంక సింగ్ ప్రచారం స్టార్ట్ చేసింది. మానస్‏కు ఓటు వేయండి.. మన ఫ్రెండ్ మానస్‏ను గెలిపిద్దామంటూ తన ఇన్‏స్టాలో పోస్ట్ చేసింది పింకీ.

  • 17 Dec 2021 09:44 PM (IST)

    శ్రీరామచంద్ర గెలుపు కోసం యాంకర్ రవి ప్రయత్నం..

    బిగ్‏బాస్ షో తుది దశకు వచ్చింది. దీంతో తమకు ఇష్టమైన వారికి గెలిపించుకునేందుకు ఐదో సీజన్ కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు. శ్రీరామచంద్రకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న యాంకర్ రవి ఎప్పటికప్పుడు తనదైన శైలీలో ప్రచారం చేస్తున్నాడు. తాజాగా జై శ్రీరామ్ అంటూ అంటూ ఓ పోస్ట్ వేశాడు. అంతే కాకుండా శ్రీరామచంద్ర పాడిన గెలుపు తలుపులే తీసే పాటను బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే చేశాడు.

  • 17 Dec 2021 09:40 PM (IST)

    సన్నీ గెలవాలని కోరుకుంటున్న .. నటరాజ్ మాస్టర్ కామెంట్స్.

    బిగ్‏బాస్ షో ముగియడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో తమకు ఇష్టమైనవారికి గెలిపించుకోవడానికి మాజీ కంటెస్టెంట్స్ రంగంలోకి దిగారు. తాజాగా నటరాజ్ మాస్టర్ తన సపోర్ట్ ఎవరికనేది చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. సన్నీని ఇష్టమొచ్చినట్లు అంటున్నా… కంట్రోల్ అవుతున్నాడని.. అదే ప్లేస్ లో తను ఉంటే తనకు బీపీ వచ్చేదని తెలిపాడు. సన్నీ గెలవాలని కోరుకుంటున్నానని.. తన సపోర్ట్ సన్నీకే అని తెలిపాడు.

  • 17 Dec 2021 09:33 PM (IST)

    శ్రీరామ్‏కు పెరుగుతున్న మద్దతు..

    సింగర్ శ్రీరామచంద్రకు రోజు రోజుకీ సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే శంకర్ మహదేవన్, ఆర్టీసి ఎండీ సజ్జనార్, రియల్ హీరో సోనూసూద్, పాయల్ రాజ్ పుత్ వంటి వారు మద్దతు తెలపగా.. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ.. రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామల దేవి శ్రీరామచంద్రకు మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • 17 Dec 2021 09:30 PM (IST)

    షణ్ముఖ్ దూకుడు.. సన్నీ వెనుకంజ..

    గత కొద్ది రోజులుగా సన్నీ టాప్ 1లో దూసుకుపోతున్నాడు. ఇక సిరిపై అరవడంతో తన ప్రవర్తనతో తనే మూడో స్థానానికి పడిపోయాడు షణ్ముఖ్. రెండో స్థానంలో శ్రీరామ్ నిలిచాడు.. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో సిరి ఎలిమినేట్ అని ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఇప్పటివరకు షణ్ముఖ్ ఫ్యాన్స్ సిరికి సైతం ఓట్లు వేస్తూ వచ్చారు. ఇప్పుడు సిరి ఎలిమినేట్ అయినట్టుగా ఎపిసోడ్ కంటే ముందే ప్రకటించడంతో షణ్ముఖ్‏ ఓటింగ్‏లో దూసుకుపోతున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

  • 17 Dec 2021 09:26 PM (IST)

    బిగ్‏బాస్ సీజన్ 5 అప్డేట్స్.

    షణ్ముఖ్ ఎక్కువగా ఊహాగానాలు చేస్తున్నాడు.. అందుకే అతను బయటకు వెళ్తే మంచిది అని మానస్ అనగా.. మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు లేవంటూ కేవలం షణ్ముఖ్‏తో గొడవలు ఉన్నాయని సన్నీ చెప్పాడు. ఇక ఆ తర్వా.. సిరితో నాకు ఇంటరాక్షన్‌ తక్కువగా ఉందని శ్రీరామ్ చేప్పాడు.. మొత్తానికి సిరి ఎలిమినేట్ అని చెప్పాడు బిగ్ బాస్.

  • 17 Dec 2021 09:23 PM (IST)

    బిగ్‏బాస్ సీజన్ 5 అప్డేట్స్..

    బిగ్‏బాస్ 5 చివరి దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో విన్నర్ ఎవరనేది తెలీపోనుంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభిమాన కంటెస్టెంట్స్ గెలిపించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఫ్యాన్స్.

Published On - Dec 17,2021 9:19 PM

Follow us