AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్ నుంచి సిరి ఎలిమినేట్.. గేట్ దగ్గరే కుప్పకూలిన షణ్ముఖ్..

బిగ్‏బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో విజేత ఎవరనేదానిపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో బిగ్‏బాస్ విన్నర్ ఎవరు

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్ నుంచి సిరి ఎలిమినేట్.. గేట్ దగ్గరే కుప్పకూలిన షణ్ముఖ్..
Siri
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 18, 2021 | 5:03 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో విజేత ఎవరనేదానిపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో బిగ్‏బాస్ విన్నర్ ఎవరు అనే విషయంపై ఇప్పటికే ఉత్కంఠ మొదలైంది. తమ అభిమాన కంటెస్టెంట్స్‏ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారాల గురించి తెలిసిందే. ఈ క్రమంలో తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‏కు పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో సరదా కార్యక్రమాలు జరుగుతూ.. హౌస్ మేట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. గత టాస్కులనే మళ్లీ ఇస్తూ.. ఫన్ క్రియేట్ చేస్తున్నారు బిగ్‏బాస్. అయితే ఫినాలేకు మరో రెండు రోజుల సమయం ఉండగా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‏బాస్.

తాజాగా ఈరోజు విడుదలైన ప్రోమోలో సిరి ఎలిమినేట్ అయినట్లు చూపించాడు. ముందుగా ఇంటి సభ్యులందరూ తమమ బట్టలు సర్దుకుని గార్డెన్ ఏరియాకు రమ్మని ఆదేశించాడు బిగ్‏బాస్. దీంతో అందరూ తమ లగేజీ తీసుకుని గార్డెన్ ఏరియాలోకి వచ్చి నిల్చున్నారు. అయితే ఈ ఇంటలో మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది. బిగ్‏బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు బిగ్‏బాస్. అయితే షణ్ముఖ్.. ఎక్కువగా ఊహాగానాలు చేస్తున్నాడు అని మానస్ చెప్పగా.. మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు లేవంటూ షణ్ముఖ్ పేరు చెప్పాడు. ఇక హౌస్‌మేట్స్‌ అనగానే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్‌ ముఖ్యం. ఉన్న నలుగురిలో సిరితో నాకు ఇంటరాక్షన్‌ తక్కువ. కాబట్టి ఆమెనే అనుకుంటున్నా అని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత.. సిరి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి అని చెప్పాడు బిగ్‏బాస్. దీంతో కంగుతిన్న సిరి.. నేను వెళ్లను అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. అయితే బిగ్‏బాస్ డోర్లు ఓపెన్ చేయడంతో.. సిరి, షణ్ముఖ్ ఏడుస్తూ కనిపించారు. తాజా ప్రోమోలో మాత్రం సిరి బయటకు వెళ్లడం.. షణ్ముఖ్ గేట్స్ వద్దే కూర్చుని ఏడుస్తుండడం చూపించారు. మరి నిజంగానే సిరి బయటకు వెళ్లిందా.. లేదా షణ్ముఖ్‏ కోసం ఓట్లు రాబట్టేందుకు బిగ్‏బాస్ ఇలా ప్లాన్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. షణ్ముఖ్ ఫ్యాన్స్ ఇన్ని రోజులు సిరికి సైతం ఓట్స్ వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సిరి ఎలిమినేట్ అయితే మాత్రం పూర్తి ఓట్లన్ని షణ్ముఖ్‏కు పడే అవకాశం ఉంది. దీంతో షణ్ముఖ్ పుంజుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

ప్రోమో..

Also Read: Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్

Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!

Follow Us
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే