Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 17, 2021 | 7:07 PM

Allu Arjun Pushpa Release Live Updates: పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లే.. అంటూ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు... నేడు (17న )విడుదల అవుతుంది.

Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..
Bunny

పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లే.. అంటూ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు… నేడు (17న )విడుదల అవుతుంది. తెలంగాణలో పుష్ప సినిమాకు 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ముందునుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్‌ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది. ఈ మాస్‌ బీట్‌కు ఫిదా అవుతున్నారు.

కోవిడ్ టైమ్‌లో డిజిటల్ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు ఫాహద్ ఫాజిల్. అప్పటి వరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్‌.. లాక్‌ డౌన్‌ టైమ్‌లో నేషనల్‌ లెవల్‌లో క్రేజ్‌ తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ టాప్ హీరో పుష్ప సినిమా కోసం రూత్‌లెస్‌ విలన్‌గా మారారు. ఇక థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్స్ దగ్గర పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు.

సినిమా: పుష్ప ది రైజ్‌ నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫాహద్‌ ఫాజిల్‌, సునీల్‌, ధనుంజయ, అజయ్‌, అజయ్‌ఘోష్‌, అనసూయ, రావు రమేష్‌ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, రుబెన్‌ కెమెరా: మిరోస్లా కూబా బ్రొజెక్‌ రచన, దర్శకత్వం: సుకుమార్‌ విడుదల: 17.12.2021

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Dec 2021 07:00 PM (IST)

    నార్త్ ఇండియాలో బన్నీకి జేజేలు..

    ఈరోజు విడుదలైన పుష్ప మూవీ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పుష్ప సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అల్లు అర్జున్ నటనకు భాషా బేధం లేకుండా అందరూ ఫిదా అవుతున్నారు. బన్నీ నటనకు ఉత్తరాది ప్రేక్షకుల సలాం కొడుతున్నారు. పుష్పరాజ్‏గా ఊరమాస్ పాత్రలో బన్నీ అదరగొట్టాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • 17 Dec 2021 06:35 PM (IST)

    థియేటర్లలో దూసుకుపోతున్న పుష్పరాజ్..

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప. ఈరోజు విడుదలైన ఈసినిమా భారీ రెస్పాన్స్ అందుకుంది. పుష్ప చిత్రయూనిట్‏లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్వీట్..

  • 17 Dec 2021 06:20 PM (IST)

    తగ్గేదేలే.. పుష్ప సినిమాపై డైరెక్టర్స్ ప్రశంసలు..

    థియేటర్లలో పుష్ప రాజ్ సందడి చేస్తున్నాడు. భారీ స్థాయిలో విడుదలైన పుష్ప మూవీ మాస్ జాతర్ కొనసాగిస్తోంది. అల్లు అర్జున్ నటనకు.. సుకుమార్ డైరెక్షన్‏పై ప్రశంసలు కురిపిస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. ట్వీట్..

  • 17 Dec 2021 05:58 PM (IST)

    తగ్గేదేలే.. థియేటర్లలోనైనా.. ట్రెండింగ్‏లైనా..

    థియేటర్లలో పుష్ప సినిమా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రేమకథలతో ఎంటర్‏టైన్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు ఊరమాస్ కథాంశంతో మెప్పించారు. ఓ వైపు థియేటర్లలో పుష్ప రాజ్ రచ్చ చేస్తుండగా.. నెట్టింట్లో పుష్ప డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. పార్టీ లేదా పుష్పా వంటి డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

  • 17 Dec 2021 05:37 PM (IST)

    థియేటర్లలో పుష్ప మాస్ జాతర..

    అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈరోజు విడుదలైన పుష్ప మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. థియేటర్లలో పుష్ప మాస్ జాతర కనిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు.

  • 17 Dec 2021 05:12 PM (IST)

    ఊ అంటావా పాప.. ఊహూ అంటావా పాప.. సమంత స్పెషల్ పాటకు పేరడీ అదుర్స్..

    ఓవైపు థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు సమంత స్పెషల్ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ లిరిక్స్‌కు పూర్తి ఆపోజిట్‌లో.. ఉన్న లిరిక్స్‌తో వచ్చిన ఓ పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప సినిమాలోని లిరిక్స్‌కు కౌంటర్‌గా ఈ పాటని రాశారా అనేతంలా ఉన్నాయి. అవేంటో ఓసారి వినండి.

  • 17 Dec 2021 04:53 PM (IST)

    బన్నీకి అయాన్ ఎలా విష్ చేసాడో తెలుసా..

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ.. ఓ వైట్ పేపర్ పెన్సిల్ తో చేతిలో గొడ్డలి పట్టెకుని పుష్పరాజ్ పాత్రని తలపించేలా గీతలు గీసిన అయాన్ `పుష్ప` రిలీజ్ (17-12-2021) ఆల్ ద బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ` అని విషెస్ తెలియజేశాడు. ఈ ఫొటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బన్నీ ఆనందంతో మురిసిపోయాడు. `థ్యాంక్యూ సోమచ్ నా చిన్ని బాబు. ఐ లవ్యూ మై అయాన్. ఈ కార్డ్ తో ఈ ఉదయాన్ని నాకెంతో ప్రత్యేకంగా మలిచావు` అని తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆకట్టుకుంటోంది.

  • 17 Dec 2021 04:34 PM (IST)

    పుష్ప మూవీపై డైరెక్టర్ హారిష్ శంకర్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ సూపర్ హిట్ టాక్ సంపాందిచుకుంది. ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ట్వీట్..

  • 17 Dec 2021 04:04 PM (IST)

    పుష్ప మూవీ అప్డేట్స్..

    హిందీలోనూ అదరగొడుతున్న పుష్ప రాజ్.. డైరెక్షన్, పర్ఫామెన్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్స్, యాక్షన్ అదిరిపోయాయంంటూ కామెంట్స్..

    ట్వీట్..

  • 17 Dec 2021 03:45 PM (IST)

    థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ రచ్చ..

    అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప సినిమా ఈరోజు విడుదలైంది. ఉదయం నుంచి థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ క్రమంలో ఎస్వీసీ రంజనీ శివరంజనీ థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్.. థియేటర్ల గేట్లను సైతం దూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్‏ను గోల్డ్ మైన్స్ టేలీఫిల్మ్స్ ట్వి్ట్టర్ ఖాతా షేర్ చేయగా.. పుష్పచిత్రయూనిట్ రీట్వీట్ చేసింది.

  • 17 Dec 2021 03:37 PM (IST)

    పుష్ప సినిమా పై ఆర్ఆర్ఆర్..

    అల్లు అర్జున్ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ట్వీట్..

  • 17 Dec 2021 03:19 PM (IST)

    నికిల్ సిద్ధార్థ్.. పుష్ప..

    ఇప్పుడే పుష్ప సినిమాను చూశాను. కమర్షియల్ సినిమాలో క్యారెక్టర్ స్టడీ ఫార్మాట్ చాలా అరుదు. సుకుమార్ సర్, అల్లు అర్జున్ బాయ్ హ్యాట్సాఫ్. మీ అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకదాన్ని అందించిన అల్లుఅర్జున్ భాయ్.. ట్వీట్..

  • 17 Dec 2021 03:14 PM (IST)

    పుష్ప సినిమాపై హీరో నాగశౌర్య కామెంట్స్..

    థియేటర్లలో పుష్పరాజ్ దుమ్మురేపుతున్నాడు. ఉదయం నుంచి పుష్ప థియేటర్ల వద్ద బన్నీ అభిమానుల సందడి మాములుగా లేదు. పాన్ ఇండియా వైడ్ మాస్సివ్ రెస్పాన్స్.. హృదయపూర్వక శుభాకాంక్షలు బన్నీ అన్న అంటూ విష్ చేశారు హీరో నాగశౌర్య.

    ట్వీట్..

  • 17 Dec 2021 12:32 PM (IST)

    బాక్సర్స్ ను పోలీసులను లెక్క చేయని ఫ్యాన్..

    చూట్టూ ఉన్న బన్నీ బాక్సర్స్... అండ్‌ పోలీసులను కూడా లెక్కచేయకుండా... వారు కంట్రోల్‌కు అందకుండా బన్నీ చూడడం కోసం ఆరాట పడ్డారు ఫ్యాన్స్. అయితే  బన్నీ... దీన్నంతా సీరియస్ గా తీసుకోకుండా చిరునవ్వుతో... అందరికీ కనిపించారు.

  • 17 Dec 2021 12:30 PM (IST)

    అల్లు అర్జున్ కారును చుట్టుముట్టిన ఫ్యాన్స్..

    సినిమా చూసేందుకు థియేటర్ కు  వచ్చిన అల్లు అర్జున్‌ అండ్‌ ఫ్యామిలీని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయలేదు బన్నీ ఫ్యాన్స్. ఆయన కార్‌ చుట్టూ చేరి బన్నీని చూసేందుకు... సెల్ఫీ తీసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.

  • 17 Dec 2021 12:28 PM (IST)

    సంధ్య థియేటర్ లో బన్నీ సందడి..

    ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లో సినిమా వీక్షించారు. అల్లు అర్జున్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.

  • 17 Dec 2021 11:37 AM (IST)

    అనంతపురంలో అభిమానుల ఆందోళన..

    హిందూపురంలో పుష్ప సినిమా షో లేటుగా స్టార్ట్ చేశారని అభిమానులు ఆందోళనకు దిగారు.. థియేటర్ వద్ద గందగోళ పరిస్థితిని క్రియేట్ చేశారు. థియేటర్ పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు..

  • 17 Dec 2021 11:31 AM (IST)

    లేడీస్ కూడా పుష్ప సినిమా కోసం...

    లేడీస్ కూడా పుష్ప సినిమా కోసం థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఫ్యాన్స్..

  • 17 Dec 2021 11:30 AM (IST)

    విశాఖపట్నంలో అల్లు అర్జున్ అభిమానులు సందడి

    విశాఖపట్నంలో అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు ఉదయం నుంచి థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. బెనిఫిట్ షో వేయకపోవడంతో కాస్త నిరాశపడ్డారు అల్లు అర్జున్ అభిమానులు. ఇక ఇప్పడు మార్నింగ్ షో స్టార్ట్ అవవడంతో అభిమానులు క్యూ కట్టారు..

  • 17 Dec 2021 10:19 AM (IST)

    టపాసులుతో బన్నీ ఫ్యాన్స్ హంగామా..

    సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్.. టపాసులు పేల్చుతూ హంగామా చేస్తున్న ఫ్యాన్స్..

  • 17 Dec 2021 09:46 AM (IST)

    సినిమా సూపర్ అంటున్న ప్రేక్షకులు..

    సినిమా కిరాక్ ఉంది అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.. ''పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్'' అంటూ డైలాగులు చెప్తున్నా ఫ్యాన్స్..

  • 17 Dec 2021 09:43 AM (IST)

    అల్లు అర్జున్ ఫోటోలకు దండలేసి కొబ్బరికాయలు కొడుతూ..

    అల్లు అర్జున్ ఫోటోలకు దండలేసి కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్యాన్స్.. అలాగే మరికొంతమంది ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు.

  • 17 Dec 2021 08:41 AM (IST)

    బన్నీ ఫోటోలకు పాలాభిషేకాలు..

    రచ్చ రచ్చ చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు.. థియేటర్స్ దగ్గర బన్నీ ఆర్మీ హంగామా చేస్తున్నారు. అల్లు అర్జున్ కటౌట్స్ కు ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు ఫ్యాన్స్.

  • 17 Dec 2021 07:52 AM (IST)

    ర్యాలీలు చేస్తున్న బన్నీ అభిమానులు..

    పుష్పసినిమా సందర్భంగా.. అభిమానుల సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫొటోలతో.. ఫ్లేక్సిలతో  ర్యాలీలు చేస్తున్నారు..

  • 17 Dec 2021 07:33 AM (IST)

    గాజువాక‌లో బన్నీ హంగామా...

  • 17 Dec 2021 07:20 AM (IST)

    రాజమండ్రిలో సందడి చేస్తున్న బన్నీ ఫ్యాన్స్..

    పుష్ప రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో బన్నీ ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు.. జై బన్నీ నినాదాలతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్..

  • 17 Dec 2021 06:57 AM (IST)

    రచ్చ రచ్చ చేస్తున్న అభిమానులు..

  • 17 Dec 2021 06:42 AM (IST)

    మొదలైన పుష్పరాజ్ జాతర..

    అర్ధరాత్రి నుంచే మొదలైన అభిమానుల సందడి.. థియేటర్స్ వద్ద పండగ వాతావరణం..

Published On - Dec 17,2021 6:39 AM

Follow us
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..