HIT 2: ఆధారాల కోసం సాగే అన్వేషణ.. ఆకట్టుకుంటున్న అడివి శేష్ హిట్ 2 గ్లింప్స్..
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం హిట్ 2. గతంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్.. ది ఫస్ట్
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం హిట్ 2. గతంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్.. ది ఫస్ట్ కేస్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సిక్వెల్గా నాని ఇప్పుడు హిట్.. ది సెకండ్ కేస్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో అడివి శేష్ కు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు అడివి శేష్ పుట్టిన రోజు కావడంతో కాసేపటి క్రితం హిట్ 2 సినిమా గ్లింప్స్ విడుదల చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్ల్స్ లో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అడివి శేష్ కు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ.. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్.. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడడం.. తన అన్వేషణకు అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. మొత్తానికి హిట్ 2 గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అడివి శేష్.. మేజర్ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు.
Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్
Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!