కలువ కళ్ళు.. అందమైన మోము.. కళ్ళతో అభినయం పలికిస్తున్న ఈ కుర్రది ఎవరో గుర్తుపట్టారా..?
హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకోవడం అంత సులభం కాదు.. అదికూడా ఇప్పుడు పరిస్థితుల్లో.. కొత్త అందాలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్న
హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకోవడం అంత సులభం కాదు.. అదికూడా ఇప్పుడు పరిస్థితుల్లో.. కొత్త అందాలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్న ఈ తరుణంలో ఈ అమ్మడు ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాధించుకుంది. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా కానీ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా టాలీవుడ్ లోకే కాదు.. కుర్రాళ్ళ గుండెల్లోకి రాకుమారిగా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ఈ భామ ఎవరో గుర్తుపట్టారా.. ? కన్నడలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎదగాలని చూస్తుంది. చేసిన ఒక్క సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవడంతో ఇప్పుడు ఈ సుందరాంగికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందంగా ముస్తాబయ్యి కూచిపూడి ప్రదర్శన ఇస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టడం అంత కష్టం కాకపోవచ్చు మరి కనిపెట్టారా..?
కూచిపూడి ప్రదర్శను ఇస్తున్న ఈ కుర్రది ఎవరో కాదు. మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో నటించిన శ్రీలీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహించిన సినిమా పెళ్లి సందడి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రీలీల అందానికి, అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే అయినా కణ్డలో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి సందడి సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల. తాజాగా ఈ అమ్మడు చిన్నపాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందంగా కూచిపూడి చేస్తూ అభినయాన్ని కనబరుస్తున్న శ్రీలీల ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :