AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: విక్రమ్, సల్మాన్‌లపై ‘కరోనా’ ఎఫెక్ట్.. ఏం జరిగిందంటే..!

కరోనా వైరస్ ప్రపంచదేశాలను గజగజ వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికీ 4,721మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టంతో పాటు పలు దేశాలు ఆర్థికంగానూ కుంగిపోతున్నాయి.

Coronavirus: విక్రమ్, సల్మాన్‌లపై 'కరోనా' ఎఫెక్ట్.. ఏం జరిగిందంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2020 | 4:06 PM

Share

కరోనా వైరస్ ప్రపంచదేశాలను గజగజ వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికీ 4,721మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టంతో పాటు పలు దేశాలు ఆర్థికంగానూ కుంగిపోతున్నాయి. ఇక భారత్‌లోనూ ఒక కరోనా మృతి కేసు నమోదైంది. కాగా కరోనా ప్రభావం ఇప్పుడు సినిమాలపై బాగా పడింది. ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు హీరోలు. అంతేకాదు షూటింగ్‌లు కూడా ఆగిపోతున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయకపోవడమే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు దేశాధినేతలు ప్రకటించడంతో హీరోలు సైతం తమ షూటింగ్‌లను ఆపుకుంటున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ నటుడు విక్రమ్‌లపై కరోనా ఎఫెక్ట్ పడింది.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన విదేశీ టూర్లను రద్దు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ కన్‌సర్ట్‌ల్లో భాగంగా అమెరికా, కెనడాకు సల్మాన్‌ను వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆయా దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు సల్లూభాయ్. మరోవైపు విక్రమ్ ప్రస్తుతం కోబ్రా అనే చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ కోసం ఇటీవలే టీమ్ రష్యాకు వెళ్లింది. అయితే కరోనా నేపథ్యంలో భారతదేశం ట్రావెల్ బ్యాన్ రూల్స్‌ను పెట్టిన నేపథ్యంలో టీమ్‌ తిరిగి ఇండియాకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న దర్శకుడు అజయ్ ఙ్ఞానముత్తు.. కరోనా ప్రభావంతో రష్యాలో సగం షూటింగ్‌ను చేసుకొని వెనుదిరుగుతున్నాము. పోవమ్మ కరోనా నువ్వు అని ట్వీట్ చేశారు. కాగా వీరిద్దరే కాదు టాలీవుడ్‌లోనూ చాలామంది హీరోలు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకోవడంతో పాటు.. షూటింగ్‌లను రద్దు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. అంతేకాదు కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ను కూడా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Read This Story Also: మోదీకి కేవీపీ లేఖ… మ్యాటరేంటంటే?

లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్