AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ‘బిగ్‌ బాస్ 4’ హోస్ట్‌గా మహేష్ బాబు..!

తెలుగు తెరపైన విజయవంతంగా కొనసాగుతోన్న షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికీ ఈ షో మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్‌కు అందరిలో ఆదరణ పెరగడంతో పాటు టీఆర్పీ రేటింగ్‌లు కూడా మంచిగా వస్తుండటంతో ఈ షోను ఇలానే కంటిన్యూ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు

Bigg Boss 4: 'బిగ్‌ బాస్ 4' హోస్ట్‌గా మహేష్ బాబు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2020 | 4:50 PM

Share

తెలుగు తెరపైన విజయవంతంగా కొనసాగుతోన్న షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికీ ఈ షో మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్‌కు అందరిలో ఆదరణ పెరగడంతో పాటు టీఆర్పీ రేటింగ్‌లు కూడా మంచిగా వస్తుండటంతో ఈ షోను ఇలానే కంటిన్యూ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌కు సంబంధించిన పనులు అప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్‌ను సంప్రదించారట నిర్వాహకులు. అంతేకాదు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారట. కానీ ఈ షోకు మళ్లీ హోస్ట్‌గా వచ్చేందుకు జూనియర్ అంతగా ఆసక్తిని చూపలేదట. దీంతో నిర్వాహకులు మహేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు సూపర్‌స్టార్ కూడా ఆసక్తిని చూపుతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్‌ ఫార్మాట్‌ను నిర్వాహకులు మారుస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సారి బిగ్‌బాస్ మరింత క్రేజీగా మారడం ఖాయం. కాగా ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ మొదటి సీజన్ ప్రారంభమైంది. ఆ తరువాత రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌లుగా చేశారు. హోస్ట్‌లుగా ఈ ముగ్గురికి మంచి మార్కులే పడిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్.. ఆ మూవీతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించిన సూపర్‌స్టార్.. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్యలోనూ మహేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Read This Story Also: విక్రమ్, సల్మాన్‌లపై ‘కరోనా’ ఎఫెక్ట్.. ఏం జరిగిందంటే..!

Follow Us
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..