AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

Zee Telugu Prema Entha Madhuram: ‘ప్రేమ’ .. దీనికి అర్ధం ఏంటని అందరిని అడిగితే వారి దగ్గర నుంచి వచ్చే మొదటి సమాధానం అనుభూతి.. ప్రేమ అనేది ఆధిపత్యం చేయదు. కేవలం స్నేహం, ఆప్యాయత, అనురాగాలను పంచుతుంది. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ప్రేమ స్వచ్ఛమైనది.. అదొక నమ్మకం.. ఏమి అడగకుండా.. కోరినవన్నీ ఇస్తుంది. నిజమైన ప్రేమకు మరణం అనేది లేదని చాలామంది మాట. ఈ ప్రేమ కాన్సెప్ట్‌తోనే జీ తెలుగులో కొత్తగా ‘ప్రేమ ఎంత మధురం’ […]

'ప్రేమ ఎంత మధురం'.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..
Ravi Kiran
|

Updated on: Mar 13, 2020 | 2:27 PM

Share

Zee Telugu Prema Entha Madhuram: ‘ప్రేమ’ .. దీనికి అర్ధం ఏంటని అందరిని అడిగితే వారి దగ్గర నుంచి వచ్చే మొదటి సమాధానం అనుభూతి.. ప్రేమ అనేది ఆధిపత్యం చేయదు. కేవలం స్నేహం, ఆప్యాయత, అనురాగాలను పంచుతుంది. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ప్రేమ స్వచ్ఛమైనది.. అదొక నమ్మకం.. ఏమి అడగకుండా.. కోరినవన్నీ ఇస్తుంది. నిజమైన ప్రేమకు మరణం అనేది లేదని చాలామంది మాట. ఈ ప్రేమ కాన్సెప్ట్‌తోనే జీ తెలుగులో కొత్తగా ‘ప్రేమ ఎంత మధురం’ అనే సీరియల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ మొదలైన కొద్దిరోజుల్లోనే టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ 5లో నిలవడం విశేషం.

ఈ సీరియల్ ప్రోమోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించి సీరియల్ అంచనాలను అమాంతం పెంచేశారని చెప్పాలి. ఇక సీరియల్ కథ విషయానికి వస్తే 40 ఏళ్ల దైనిమిక్ బిజినెస్ మ్యాన్, 19 ఏళ్ల యువతి మధ్య ప్రేమ ఎలా చిగురించింది… ఆ తర్వాత అది ఎలాంటి మలుపులు తిరిగిందన్నది సీరియల్ వృత్తాంతం. కొత్త కాన్సెప్ట్‌లను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కామన్. అలాగే ఈ సీరియల్‌కు కూడా విశేష ఆదరణ లభిస్తోంది.

ఇప్పటివరకు జరిగిన కథ….

అను రాజీనామాను ఆర్యవర్ధన్ ఆమోదించకుండా.. జరిగిన పొరపాటుకు క్షమాపణ అడుగుతాడు. ఇక అను కూడా జరిగిన దానిలో తనదే తప్పు ఉందని.. ఇకపై అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇస్తుంది. దీనితో ఆర్యవర్ధన్ శాంతించగా.. ఫ్యాక్టరీ వర్కర్ల కష్టాలు తెలియడంతో ఈ తతంగం అంతటికి కారణమైన మీరాపై కస్సుమంటాడు. ఇంకోసారి నాకు తెలియకుండా ఏదైనా డెసిషన్ తీసుకుంటే నీ ఉద్యోగం ఊస్ట్ అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇకపై తన షెడ్యూల్ మొత్తం కూడా అను చూసుకుంటుందని అల్టిమేటం జారీ చేస్తాడు. ఈ క్రమంలో అను, ఆర్యల మధ్య ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది.

ఇదిలా ఉంటే అను ఊహల్లో ఆర్యవర్ధన్ విహరిస్తుండగా సడన్ షాక్ ఇస్తూ సంజయ్.. తనకు, అనుకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని బిగ్ బాంబ్ పేలుస్తాడు. ఆర్యవర్ధన్ ఏమో జెండేను సంజయ్ గురించి కనుక్కోమని చెప్తాడు. అప్పుడు జెండే ఆర్యపై కోప్పడి నువ్వు చక్రవర్తివి అది నీకు తెలుస్తోందా అంటూ గతం గుర్తు చేస్తాడు. ఆర్యవర్ధన్‌పై కూడా ఫైర్ అవుతాడు. అటు ఆర్యవర్ధన్ కోసం అను స్వయంగా పాయసం చేసుకుని ఆఫీస్‌కి బయల్దేరుతుంది.? ఆర్యవర్ధన్ దాన్ని తిప్పికొడతాడు. అందరికి తన పెళ్లి విషయం తెలియడంతో అను తలదించుకుంటుంది.

ఇంతకీ నిజంగా అనుకి పెళ్లి ఫిక్స్ అయిందా.? సంజయ్‌తో అను పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది.? అసలు ఆర్యవర్ధన్ ఎవరు.? జెండేతో ఉన్న సంబంధం ఏంటి.? జెండేలో ఉన్న రెండు షేడ్స్ ఏంటన్నది.? నేటి ఎపిసోడ్‌లో చూడాలి.?

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…