ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

Coronavirus Scare: కరోనా.. కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట ప్రజల్లో భయాందోళనను సృష్టిస్తుంది. ఆఫీసులు.. స్కూళ్లు.. కాలేజీలు.. ఇలా ప్రదేశం ఏదైనా తుమ్మినా.. దగ్గినా.. అదేదో పెద్ద నేరంగా అనుకుంటున్నారు. అందుకే ఇటీవల డబ్ల్యూహెచ్ఓ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే విదేశీ వీసాలను ఏప్రిల్ 15 వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని నివారించేందుకు ఇప్పటివరకు ఎటువంటి మందులను కనిపెట్టలేదు. […]

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స...
Follow us

|

Updated on: Mar 13, 2020 | 2:28 PM

Coronavirus Scare: కరోనా.. కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట ప్రజల్లో భయాందోళనను సృష్టిస్తుంది. ఆఫీసులు.. స్కూళ్లు.. కాలేజీలు.. ఇలా ప్రదేశం ఏదైనా తుమ్మినా.. దగ్గినా.. అదేదో పెద్ద నేరంగా అనుకుంటున్నారు. అందుకే ఇటీవల డబ్ల్యూహెచ్ఓ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే విదేశీ వీసాలను ఏప్రిల్ 15 వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ వ్యాధిని నివారించేందుకు ఇప్పటివరకు ఎటువంటి మందులను కనిపెట్టలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కరోనా ఇది వాడితే తగ్గుతుందని.. అది వాడితే తగ్గుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా చికిత్స‌ కోసం హెచ్ఐవీ పేషెంట్స్‌కు ఉపయోగించిన రెండు డ్రగ్స్‌ను కరోనా బాధితులైన ఇటాలియన్ జంటకు జైపూర్ హాస్పిటల్‌లో వాడుతున్నారు.

హెచ్ఐవీ మందులు లోపినవిర్, రితోనవిర్‌లను అనుమతులు తీసుకునే కరోనా సోకిన ఈ జంటకు వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి అనుమతి తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. దాని తర్వాత ఈ రెండు డ్రగ్స్ కాంబినేషన్‌కు ఆమోదం లభించిందని అన్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఎయిడ్స్ వ్యాధి కూడా అంటే.. అందుకే HIV మందులను చైనాలో కూడా ఉపయోగించారు.

కాగా, కరోనా సోకిన 69 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుతో బాగుపడుతున్నాడు. ప్రస్తుతం అతనికి జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతన్ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. వీరిరువురూ కూడా తమ వైద్యానికి ఒప్పుకున్నారని మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అదనపు చీఫ్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. ఇక అత్యవసర సమయంలోనే ఈ మందులను వాడుతున్నట్లు ఆయన తెలిపారు.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…