కోయిలమ్మ ఫేం సమీర్ కేసులో ట్విస్ట్.. స్నేహితురాలి వ్యాపారం విషయంలో గొడవ.. తిరిగి కేసు పెట్టిన నటుడు..

కోయిలమ్మ ఫేం సమీర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి.. ఇద్దరు

  • Rajitha Chanti
  • Publish Date - 11:15 am, Thu, 28 January 21
కోయిలమ్మ ఫేం సమీర్ కేసులో ట్విస్ట్.. స్నేహితురాలి వ్యాపారం విషయంలో గొడవ.. తిరిగి కేసు పెట్టిన నటుడు..

కోయిలమ్మ ఫేం సమీర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి.. ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డాడు. వారితో పాటు స్వాతి అనే అమ్మాయి కూడా ఆ మహిళలపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో సమీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళలు. వారి దగ్గర నుంచి రూ.5 లక్షలు తీసుకున్న సమీర్..  తిరిగి డబ్బు చెల్లించాలని అడిగినందుకు మణికొండలో ఉంటున్న ఇద్దరు మహిళల ఇంటికి వచ్చి వీరంగం సృష్టించాడు. సమీర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు ఆ ఇద్దరు మహిళలు.

ఓ బొటిక్ విషయంలో శ్రీవిద్య, లక్ష్మి, స్వాతిల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బొటిక్ వ్యాపారం నుంచి స్వాతి తప్పుకుంది. తనకు రావాల్సిన వస్తువుల తీసుకోవడానికి శ్రీవిద్య ఇంటికెళ్ళింది స్వాతి. అదే సమయంలో తన స్నేహితులరాలితో పాటు సమీర్ కూడా శ్రీవిద్య ఇంటికెళ్లాడు. అనంతరం స్వాతి తనకు రావాల్సిన డబ్బుల గురించి అడుగగా.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అమర్ తమ ఇంటికి వచ్చిన దాడికి పాల్పడినట్లుగా శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అమర్, స్వాతి కూడా తిరిగి కేసు పెట్టారు. అమర్ అసభ్య పదజాలంతో దూషించాలని శ్రీవిద్య ఫిర్యాదులో పేర్కోంది. “నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను అన్ని విషయాలను పోలీసులకు చెబుతానని టీవీ9తో చెప్పుకొచ్చాడు అమర్. తను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని అమర్ అన్నారు.